మీ అభిమానానికి థ్యాంక్స్‌ : కేఎల్‌ రాహుల్‌ | KL Rahul Thanks To Fans For Getting 5 Million Followers In Twitter | Sakshi
Sakshi News home page

మీ అభిమానానికి థ్యాంక్స్‌ : కేఎల్‌ రాహుల్‌

Dec 16 2020 9:37 AM | Updated on Dec 16 2020 11:11 AM

KL Rahul Thanks To Fans For Getting 5 Million Followers In Twitter - Sakshi

అడిలైడ్‌ : 2014లో టీమిండియాకు ఎంపికైన కేఎల్‌ రాహుల్‌ అనతికాలంలోనే మంచి టైమింగ్‌ ఉన్న క్రికెటర్‌గాపేరు సంపాదించాడు. కెరీర్‌ ఆరంభం నుంచి సొగసైన షాట్లతో అలరిస్తూ టీమిండియా జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. పంత్‌, వృద్దిమాన్‌ సాహా, దినేష్‌ కార్తిక్‌ వంటి ఆటగాళ్ల నుంచి పోటీని తట్టుకొని మరీ ఎంఎస్‌ ధోని తర్వాత అన్ని ఫార్మాట్లకు రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌గా స్థానం భర్తీచేసే పనిలో ఉన్నాడు. తాజాగా కేఎల్‌ రాహుల్‌ ట్విటర్‌ ఖాతా ఐదు మిలియన్ల ఫాలోవర్స్‌కు చేరుకుంది. ఈ విషయంపై రాహుల్‌ ఆనందం వ్యక్తం చేస్తూ స్పందించాడు. (చదవండి : 'క్షమించండి.. మళ్లీ రిపీట్‌ కానివ్వను')

' మీ అభిమానానికి థ్యాంక్స్‌.. మీరిచ్చిన సపోర్ట్‌ నాకు ఎంతో ప్రత్యేకం. జీవితంలో ఎత్తు పల్లాలు ఉన్నా మీరిచ్చే సహకారంతో ఇంతదాకా చేరుకున్నా.. మీ ప్రేమ ఇకమీదట కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్‌ చేశాడు. 2014లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన కేఎల్‌ రాహుల్‌ 35 వన్డేల్లో 4 సెంచరీల సాయంతో  1332 పరుగులు, 36 టెస్టుల్లో 5 సెంచరీల సాయంతో 2006 పరుగులు, 44 టీ20ల్లో 1542 పరుగులు సాధించాడు. టీ20లో రాహుల్‌ రెండు సెంచరీలు సాధించాడు. కాగా ఐపీఎల్‌ 13వ సీజన్‌లో కేఎల్‌ రాహుల్‌ దుమ్మురేపే ప్రదర్శన నమోదు చేశాడు. కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహించిన రాహుల్‌  ఒక సెంచరీ.. 5 అర్థ సెంచరీలతో మొత్తం 14 మ్యాచ్‌ల్లో 670 పరుగులు సాధించి లీగ్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement