Ishan Kishan: ఇషాన్‌ అరుదైన ఫీట్‌.. ధోని, పంత్‌లకు సాధ్యం కాలేదు

Ishan Kishan Breaks Dhoni-Rishabh Pant Record Was 1st Indian Wicketkeeper - Sakshi

టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ అరుదైన ఫీట్‌ సాధించాడు. టి20ల్లో ఒక మ్యాచ్‌లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు సాధించిన వికెట్‌ కీపర్‌గా ఇషాన్‌ కిషన్‌ తొలి స్థానంలో నిలిచాడు. శ్రీలంకతో జరిగిన తొలి టి20లో ఇషాన్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన సంగతి తెలిసిందే. 57 బంతుల్లోనే 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేశాడు. తద్వారా టీమిండియా వికెట్‌ కీపర్‌గా ఒక మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఇషాన్‌ నిలిచాడు.

 కాగా టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్‌ ధోని 2017లో బెంగళూరు వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో 56 పరుగులు చేసి వికెట్‌ కీపర్‌గా ఒక మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలచాడు. ధోని రికార్డును రిషబ్‌ పంత్‌ సవరించాడు.  2019లో వెస్టిండీస్‌పై 42 బంతుల్లో 65 పరుగులతో  ధోనిని క్రాస్‌ చేసి తొలి స్థానంలో నిలిచాడు. తాజాగా ఇషాన్‌ కిషన్‌ ధోని, పంత్‌లను భారీ మార్జిన్‌తో అధిగమించి తొలి స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించాడు.

కరీబియన్‌పై వరుస క్లీన్‌స్వీప్‌లు చేసి జోరుమీదున్న భారత్‌... లంకనూ చిత్తు చేసింది. తొలి టి20లో రోహిత్‌ సేన 62 పరుగులతో జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీస్కోరు చేసింది. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులకే పరిమితమైంది. చరిత్‌ అసలంక (47 బంతుల్లో 53 నాటౌట్‌; 5 ఫోర్లు) రాణించాడు.  

Video: ఇషాన్‌ కిషన్‌ మెరుపు ఇన్నింగ్స్‌ 

చదవండి: Ishan Kishan: ఊచకోత అంటే ఇదే.. పూనకం వచ్చినట్లు ఆడాడు

ఇషాన్‌ 'ధన్‌ ధనాధన్‌'.. తొలి టి20లో టీమిండియా సూపర్‌ విక్టరీ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top