టీ20 ప్రపంచకప్-2026 హీరో సంజూ శాంసన్ ఐపీఎల్ తాజా ఎడిషన్ తొలి మ్యాచ్‌లోనే నిరాశపరిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున భారీ అంచనాలతో బరిలోకి దిగాడు ఈ కేరళ స్టార్. ఐపీఎల్-2026లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో సోమవారం నాటి మ్యాచ్ సందర్భంగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి సీఎస్‌కే ఇన్నింగ్స్ ఆరంభించాడు సంజూ.
క్లీన్‌బౌల్డ్
జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) రాయల్స్ బౌలింగ్ ఎటాక్ ఆరంభించగా.. సంజూ ఐదో బంతికి ఫోర్ బాది ఖాతా తెరిచాడు. అయితే, ఆ తర్వాత బ్యాట్ ఝులిపించలేకపోయిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. రెండో ఓవర్ ఆఖరి బంతికే పెవిలియన్ చేరాడు.
రాయల్స్ పేసర్ నండ్రీ బర్గర్ బౌలింగ్‌లో సంజూ శాంసన్ (Sanju Samson) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో మొత్తంగా ఏడు బంతులు ఎదుర్కొన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. సీఎస్‌కే తరఫున అరంగేట్ర మ్యాచ్‌లోనే సంజూ విఫలం కావడంతో అభిమానులు ఉసూరుమంటున్నారు.
𝐒𝐨𝐮𝐧𝐝𝐬 𝐨𝐟 𝐓𝐢𝐦𝐛𝐞𝐫 🎶
Nandre Burger 🤝 Jofra Archer #RR fans, how was that for a start? 😉
Updates ▶️ https://t.co/UzbuFk5G26#TATAIPL | #KhelBindaas | #RRvCSK | @rajasthanroyals pic.twitter.com/iqLU8yIgcX— IndianPremierLeague (@IPL) March 30, 2026
వరల్డ్‌కప్ హీరో సంజూ
కాగా స్వదేశంలో టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు ఫామ్ కోల్పోయిన సంజూ శాంసన్‌కు.. అదృష్టవశాత్తూ సూపర్-8 మ్యాచ్‌ల సందర్భంగా తిరిగి తుది జట్టులోకి వచ్చే అవకాశం దక్కింది. ఈ క్రమంలో సూపర్-8 నాకౌట్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 97 పరుగులతో రాణించిన సంజూ.. ఆ తర్వాత కూడా భీకర ఫామ్ కొనసాగించాడు.
ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో, న్యూజిలాండ్‌తో ఫైనల్లో వరుసగా 89, 89 పరుగులు చేసిన సంజూ.. భారత్ చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఇదే జోరులో చెన్నై తరఫునా చెలరేగుతాడని అభిమానులు కొండంత ఆశతో ఎదురుచూడగా.. తొలి మ్యాచ్‌లోనే సంజూ తడబడ్డాడు.
కకావికలం
కాగా తాజా సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌లో చెన్నై రాజస్తాన్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు మైదానంలో దిగింది. గౌహతి వేదికగా టాస్ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఇక గాయం కారణంగా దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని దూరంకాగా.. అతడి స్థానంలో సంజూ వికెట్ కీపర్‌గా సేవలు అందించనున్నాడు.
కాగా రాయల్స్ పేసర్ల విజృంభణతో చెన్నై టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్లు సంజూ (6), రుతు (6) విఫలం కాగా.. ఆయుశ్ మాత్రే డకౌట్ అయ్యాడు. మాథ్యూ షార్ట్ రెండు పరుగులకే పెవిలియన్ చేరాడు. ఫలితంగా పవర్ ప్లే (6 ఓవర్లు)లో చెన్నై నాలుగు వికెట్ల నష్టానికి కేవలం 41 పరుగులే చేసింది.
చదవండి: బంగ్లాదేశ్‌కు బ్యాడ్‌న్యూస్!.. షాకిచ్చిన జియోస్టార్!


