breaking news
Nandre Burger
-
భారత్‌తో మూడో వన్డే.. సౌతాఫ్రికాకు భారీ షాకులు
భారత్‌తో కీలక మూడో వన్డేకు ముందు సౌతాఫ్రికా జట్టుకు భారీ షాక్ తగిలింది. తొలి రెండు వన్డేల్లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇద్దరు స్టార్ ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. పేసర్ నండ్రీ బర్గర్ (Nandre Burger), బ్యాటర్ టోనీ డీ జోర్జి (Tony de Zorzi) గాయాల కారణంగా విశాఖపట్నం మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. సౌతాఫ్రికా క్రికెట్ ఈ విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించింది. గాయాల కారణంగా..టీమిండియాతో రాయ్‌పూర్ వేదికగా రెండో వన్డే సందర్భంగా.. ఫాస్ట్ బౌలర్ నండ్రీ బర్గర్‌కు తొడ కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు. మధ్యలోనే అతడు మైదానం నుంచి నిష్క్రమించాడు. మరోవైపు.. డి జోర్జి కూడా తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరనికి శుక్రవారం స్కానింగ్‌కు పంపగా.. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలింది.టీ20 సిరీస్ మొత్తానికి అతడు దూరంఫలితంగా బర్గర్, డి జోర్జికి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సౌతాఫ్రికా క్రికెట్ వెల్లడించింది. డి జోర్జి భారత్‌తో ఆఖరి వన్డేతో పాటు.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ మొత్తానికి కూడా దూరమైనట్లు తెలిపింది. అతడు స్వదేశానికి తిరిగి వస్తున్నట్లు పేర్కొంది. అయితే, అతడి స్థానంలో వేరే ఆటగాడిని ఎంపిక చేయలేదని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఈ సందర్భంగా వెల్లడించింది.క్వెనా మఫాకా సైతం..అదే విధంగా.. యువ ఫాస్ట్ బౌలర్ క్వెనా మఫాకా కూడా తొడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు తెలిపిన ప్రొటిస్ బోర్డు.. అతడు పూర్తి స్థాయిలో కోలుకోలేదని తెలిపింది. కాబట్టి టీమిండియాతో టీ20 సిరీస్ ఆరంభ మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండటం లేదని పేర్కొంది. జట్టు నుంచి అతడు నిష్క్రమించాడని.. మఫాకా స్థానంలో లూథో సిపామ్లను టీ20 జట్టులోకి చేర్చినట్లు వెల్లడించింది.టెస్టులలో పైచేయి.. వన్డేలలో 1-1తో..కాగా టీమిండియాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా తొలుత ఆతిథ్య జట్టును టెస్టుల్లో 2-0తో వైట్‌వాష్ చేశారు సఫారీలు.ఇక వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ ఓడిన ప్రొటిస్ జట్టు.. రెండో వన్డేలో గెలిచి 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య సిరీస్ విజేతను తేల్చే ఆఖరిదైన శనివారం నాటి మూడో వన్డేకు విశాఖపట్నం వేదిక. ఆ తర్వాత డిసెంబరు 9 నుంచి ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్‌కు తెరలేస్తుంది.చదవండి: చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేసిన వెస్టిండీస్ -
సౌతాఫ్రికాకు భారీ షాక్
రాయ్‌పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ నాండ్రే బర్గర్ గాయపడ్డాడు. భారత ఇన్నింగ్స్ 39వ ఓవర్ వేసే క్రమంలో బర్గర్ తొడ కండరాలు పట్టేశాయి. ఆ ఓవర్లో తొలి బంతిని కాస్త ఇబ్బంది పడుతూనే సంధించిన బర్గర్.. రెండో బంతిని మాత్రం బౌల్ చేయలేకపోయాడు. బంతిని వేసే క్రమంలో అతడు రెండు సార్లు తన రన్ అప్ను కోల్పోయాడు. బర్గర్ ఆసౌకర్యంగా కన్పించాడు. వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి చికిత్స అందించాడు. అయినప్పటికి అతడు నొప్పి తగ్గలేదు. దీంతో ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. ఆ సమయంలో బర్గర్ నడిచేందుకు ఇబ్బంది పడినట్లు కన్పించింది. అతడు తిరిగి మైదానంలో రాలేదు. ఓవరాల్‌గా 6.1 ఓవర్లు బౌలింగ్ చేసిన బర్గర్ 43 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు.అయితే టీ20 సిరీస్‌కు ముందు బర్గర్ గాయపడడం సౌతాఫ్రికా టీమ్‌మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. ఇప్పటికే స్టార్ పేసర్ కగిసో రబాడ కూడా గాయం కారణంగా జట్టు బయట ఉన్నాడు. టీ20 సిరీస్ డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఆ సమయానికి బర్గర్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడో లేదో వేచి చూడాలి.భారత్ భారీ స్కోర్..ఇక రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్ సాధింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి(102), రుతురాజ్ గైక్వాడ్(105) సెంచరీలతో సత్తాచాటగా.. కేఎల్ రాహుల్(66) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ప్రోటీస్ బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు, ఎంగిడీ, బర్గర్ తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs SA 2nd Odi: విరాట్ కోహ్లి సూపర్ సెంచరీ.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్ -
IPL 2025: రాజస్థాన్ రాయల్స్‌లో మరో కీలక మార్పు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన రాజస్థాన్ రాయల్స్.. తమ జట్టులో గాయపడిన ఆటగాళ్లకు ప్రత్యామ్నాయాలను ప్రకటించింది. తొలుత నితీశ్ రాణాకు ప్రత్యామ్నాయంగా సౌతాఫ్రికా బ్యాటర్ లువాన్ డ్రి ప్రిటోరియస్‌ను జట్టులోకి తీసుకున్న రాయల్స్.. తాజాగా మరో గాయపడిన ఆటగాడు సందీప్ శర్మకు ప్రత్యామ్నాయంగా సౌతాఫ్రికాకే చెందిన నండ్రే బర్గర్‌ను ఎంపిక చేసుకుంది. బర్గర్‌ను రాయల్స్ రూ. 3.5 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఈ సీజన్లో మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉన్నా బర్గర్‌పై రాయల్స్ భారీ మొత్తాన్ని వెచ్చించింది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన బర్గర్ గత ఐపీఎల్ సీజన్లో కూడా రాయల్స్‌కే ఆడాడు. ఆ సీజన్లో అతను 6 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీశాడు. సందీప్ శర్మ విషయానికొస్తే.. ఈ సీజన్లో ఓ మోస్తరు ఫామ్‌లో ఉండిన సందీప్ చేతి వేలి గాయం కారణంగా రెండు మ్యాచ్‌ల ముందే వైదొలిగాడు. సందీప్ ఈ సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు తీశాడు. రాజస్తాన్ రాయల్స్‌కు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పార్ల్ రాయల్స్ అనే సిస్టర్ ఫ్రాంచైజీ ఉండటంతో ప్రత్యామ్నాయ ఆటగాళ్లుగా ఆ దేశ ఆటగాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. నితీశ్‌కు ప్రత్యామ్నాయంగా రాయల్స్ జట్టులోకి వచ్చిన లువాన్ డ్రి ప్రిటోరియస్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పార్ల్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతన్ని రాజస్థాన్ రాయల్స్ సీజన్లో మిగిలి ఉన్న రెండు మ్యాచ్‌ల కోసం రూ. 30 లక్షల కనీస ధరకు సొంతం చేసుకుంది. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన ప్రిటోరియస్‌కు విధ్వంసకర వీరుడిగా పేరుంది. అతను వికెట్‌కీపింగ్ కూడా చేయగలడు.ఇదిలా ఉంటే, ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆది నుంచే షాకులు తగులుతున్నాయి. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ గాయం కారణంగా వీల్‌చైర్ నుంచే మార్గదర్శనం చేస్తుండగా.. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ కూడా కొన్ని మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. ఈ సీజన్లో రాజస్థాన్ సీఎస్కే (మే 12), పంజాబ్ కింగ్స్‌తో (మే 16) మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన రాయల్స్ 3 విజయాలు, 9 పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. -
Ban vs SA: సౌతాఫ్రికా జట్టుకు బిగ్ షాక్!
సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ నండ్రే బర్గర్ గాయపడ్డాడు. ఈ క్రమంలో ఐర్లాండ్‌తో మిగిలిన రెండు వన్డేలతో పాటు.. బంగ్లాదేశ్ పర్యటనకూ దూరమయ్యాడు. కాగా సౌతాఫ్రికా జట్టు ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉంది.అక్కడ ఐర్లాండ్‌తో రెండు టీ20లు ప్రొటిస్ జట్టు.. సిరీస్‌ను 1-1తో కలిసి ప్రత్యర్థితో పంచుకుంది. ఈ క్రమంలో బుధవారం నుంచి వన్డే సిరీస్ మొదలుపెట్టింది. మొదటి మ్యాచ్‌లో 139 పరుగులతో ఐరిష్ జట్టును చిత్తు చేసిన సౌతాఫ్రికా.. శుక్రవారం రెండో వన్డేలో తలపడుతోంది.బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు కూడా దూరంఅయితే, ఈ మ్యాచ్ ఆరంభానికి ముందే క్రికెట్ సౌతాఫ్రికా నండ్రే బర్గర్ గాయం గురించి వెల్లడించింది. ఈ పేసర్ వెన్నునొప్పితో బాధపడుతున్నాడని.. దీంతో ఐర్లాండ్‌తో మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడని తెలిపింది. అదే విధంగా.. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు కూడా బర్గర్ అందుబాటులో ఉండకపోవచ్చని... త్వరలోనే అతడి స్థానాన్ని వేరొక ఆటగాడితో భర్తీ చేస్తామని పేర్కొంది.టీమిండియాతో సిరీస్‌లతో అరంగేట్రంకాగా ఐర్లాండ్‌తో తొలి వన్డేలోనూ బర్గర్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక గతేడాది డిసెంబరులో టీమిండియాతో టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన నండ్రే బర్గర్.. అదే నెలలో వన్డే, టెస్టుల్లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. భారత జట్టుతో జరిగిన మూడు టెస్టుల్లో కలిపి 14 వికెట్లు తీసిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. ఐదు వన్డేల్లో ఆరు, రెండు టీ20లలో ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఆ తర్వాత క్రికెట్ సౌతాఫ్రికా వన్డే చాలెంజ్ టోర్నీలో రాణించిన 29 ఏళ్ల నండ్రే బర్గర్.. ఈ ఏడాది ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. రాజస్తాన్ తరఫున ఆరు మ్యాచ్‌లు ఆడి ఏడు వికెట్లు పడగొట్టాడు. టీ20 ప్రపంచకప్-2024లో రన్నరప్‌గా నిలిచిన సౌతాఫ్రికా జట్టులోనూ రిజర్వు ప్లేయర్‌గా ఉన్నాడు. కాగా సౌతాఫ్రికా జట్టు అక్టోబరు 16న బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టనుంది.రెండు టెస్టులుఇరు జట్ల మధ్య అక్టోబరు 21- నవంబరు 2 వరకు రెండు టెస్టుల సిరీస్ జరుగనుంది. ఇందుకు సంబంధించి సౌతాఫ్రికా ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌కు అన్రిచ్ నోర్జే, మార్కో జాన్సెన్, లుంగి ఎంగిడీ, గెరాల్డ్ కోయెట్జీ వంటి వంటి స్టార్ పేసర్లు దూరమయ్యారు. తాజాగా బర్గర్ కూడా దూరం కావడం ప్రభావం చూపవచ్చు.బంగ్లాతో టెస్టులకు దక్షిణాఫ్రికా జట్టుటెంబా బావుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హామ్, మాథ్యూ బ్రీట్జ్కే, నండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్, వియాన్ ముల్డర్, సెనూరన్ ముత్తుసామి, డేన్ ప్యాటర్సన్, డేన్ పీడ్ట్, కగిసో రబడ, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రెకల్టన్ వెర్రేన్నే(వికెట్ కీపర్).చదవండి: పాక్ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్? -
చెలరేగిన ప్రొటిస్ పేసర్లు.. రోహిత్ సేన ఘోర పరాజయం.. ఈసారీ లేనట్లే
సౌతాఫ్రికాలో టీమిండియాకు మరోసారి పరాభవం ఎదురైంది. ఇంత వరకు సఫారీ గడ్డపై ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవని భారత జట్టు ఈసారి కూడా అవకాశాన్ని చేజార్చుకుంది. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ మీద 32 పరుగుల తేడాతో ఓడి ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది. సొంతగడ్డపై టీమిండియాపై మరోసారి ఆధిపత్యం చాటుకున్న సౌతాఫ్రికా మూడో రోజే ఆటను ముగించి సత్తా చాటింది. ప్రొటిస్ సెంచరీ హీరో డీన్ ఎల్గర్(185) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మంగళవారం మొదలైన బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచిన ఆతిథ్య సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కఠినమైన సెంచూరియన్ పిచ్‌పై ప్రొటిస్ పేసర్ల విజృంభణతో భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. స్టార్ బ్యాటర్లు, అనుభవజ్ఞులు అయిన ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(5), విరాట్ కోహ్లి(38) విఫలం కావడం ప్రభావం చూపింది. అయితే, ఆరో నంబర్లో బ్యాటింగ్‌కు దిగిన కేఎల్ రాహుల్ అసాధారణ పోరాటం కనబరిచాడు. అర్ధ శతకంతో రాణించి తొలి రోజు ఆటను ముగించాడు. అయితే రెండో రోజు ఆట సందర్భంగా సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్ నండ్రీ బర్గర్ బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ చరమాంకానికి చేరుకుంది. 67.4 ఓవర్లలో కేవలం 245 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఓపెనర్ డీన్ ఎల్గర్ అదిరిపోయే ఆరంభం అందించాడు. అతడికి తోడుగా అరంగేట్ర బ్యాటర్ బెడింగ్హామ్ అర్ధ శతకం (56)తో రాణించాడు. ఈ క్రమంలో బుధవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి 66 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసిన సౌతాఫ్రికా.. 11 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. ఇక మూడో రోజు ఆటలో భాగంగా 408 పరుగులకు ఆలౌట్ అయి ఆధిక్యాన్ని 163 పరుగులకు పెంచుకుంది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాను ప్రొటిస్ పేసర్లు దెబ్బకొట్టారు. కగిసో రబడ రోహిత్ శర్మను డకౌట్ చేసి శుభారంభం అందించగా.. నండ్రీ బర్గర్ యశస్వి జైస్వాల్(5)ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత శుబ్‌మన్ గిల్(26)ను పెవిలియన్‌కు పంపిన మార్కో జాన్సెన్.. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్(6)ను కూడా అవుట్ చేశాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి ఆచితూచి నిలకడగా ఆడాడు. అయితే, కేఎల్ రాహుల్(4) అవుటైన తర్వాత టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పతనం వేగం పుంజుకుంది. రాహుల్‌ను అవుట్ చేసిన మరుసటి బంతికే బర్గర్.. అశ్విన్‌ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత రబడ శార్దూల్ ఠాకూర్ వికెట్‌ను తన ఖాతాలో వేసుకోగా.. కోహ్లితో సమన్వయ లోపం కారణంగా బుమ్రా రనౌట్ అయ్యాడు. సిరాజ్ 4 పరుగులకే పెవిలియన్ చేరగా.. ప్రసిద్ కృష్ణ క్రీజులోకి వచ్చాడు. అయితే, 34.1వ ఓవర్ వద్ద మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో కోహ్లి రబడకు క్యాచ్ అవ్వడంతో టీమిండియా ఓటమి ఖరారైంది. సౌతాఫ్రికా బౌలర్లలో నండ్రీ బర్గర్ నాలుగు వికెట్లు తీయగా.. రబడకు రెండు, మార్కో జాన్సెన్కు మూడు వికెట్లు దక్కాయి. బుమ్రా రనౌట్‌లో ఎల్గర్, రబడ పాలు పంచుకున్నారు. .@imVkohli brings up his 5️⃣0️⃣ He came out in the middle with all guns blazing countering the fiery 🇿🇦 bowling attack 🔥 Will the 👑 go on & convert it into a big one? Tune in to #SAvIND 1st Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/edhPpCavOi — Star Sports (@StarSportsIndia) December 28, 2023


