David Warner: వార్నర్‌ అరుదైన ఫీట్‌.. కోహ్లి, ధావన్‌లతో సమానంగా

IPL 2022: David Warner Equals Kohli-Dhawans Record 8th Time 400-Runs  - Sakshi

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ తన సూపర్‌ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఈ సీజన్‌లో వార్నర్‌ లేట్‌గా జాయిన్‌ అయినప్పటికి హాఫ్‌ సెంచరీలతో అదరగొడుతున్నాడు. తాజాగా బుధవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో అర్థసెంచరీ సాధించాడు. సీజన్‌లో వార్నర్‌కు ఇది ఐదో ఫిప్టీ కావడం విశేషం. మార్ష్‌(89)తో కలిసి వార్నర్‌(52*) కీలక సమయంలో ఢిల్లీని గెలిపించి ప్లే ఆఫ్‌ అవకాశాలు సజీవంగా ఉంచాడు.

ఈ నేపథ్యంలోనే వార్నర్‌ ఐపీఎల్‌లో అరుదైన ఫీట్‌ సాధించాడు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధికసార్లు 400 పరుగుల మార్క్‌ను అందుకున్న జాబితాలో వార్నర్‌ టీమిండియా ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, శిఖర్‌ ధావన్‌లతో సమంగా నిలిచాడు. ఇప్పటివరకు వార్నర్‌ 8సార్లు 400 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. కోహ్లి, ధావన్‌లు కూడా ఐపీఎల్‌లో ఎనిమిదేసిసార్లు ఆ మార్క్‌ను అందుకున్నారు. కాగా ఈ జాబితాలో సురేశ్‌ రైనా తొలి స్థానంలో ఉన్నాడు. రైనా తొమ్మిదిసార్లు ఐపీఎల్‌లో 400 పరుగుల మార్క్‌ను అందుకోవడం విశేషం.

వార్నర్‌ 2009లో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టినప్పటికి.. 400 పరుగుల మార్క్‌ను అందుకున్నది 2013లోనే. ఆ సీజన్‌లో వార్నర్‌ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2014లో ఎస్‌ఆర్‌హెచ్‌కు మారిన వార్నర్‌.. ఆరు సీజన్ల పాటు(మధ్యలో 2018 సీజన్‌లో వార్నర్‌ ఆడలేదు) 400కి పైగా పరుగులు సాధించాడు. ఇందులో మూడుసార్లు ఆరెంజ్‌ క్యాప్‌ను అందుకున్నాడు. 2021 సీజన్‌లోనే వార్నర్‌ అంతగా రాణించలేదు. ఆ తర్వాత అవమానకర రీతిలో ఎస్‌ఆర్‌హెచ్‌ నుంచి బయటికి వచ్చిన వార్నర్‌ను ఐపీఎల్‌ మెగావేలంలో రూ.6.5 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌ కొనుగోలు చేసింది. ఇక ఈ సీజన్‌లో వార్నర్‌ 9 మ్యాచ్‌ల్లో 427 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.  

చదవండి: IPL 2022: వార్నర్‌ అదృష్టం.. రాజస్తాన్‌ కొంపముంచింది

Yuzvendra Chahal: రాజస్తాన్‌ రాయల్స్‌ తరపున యజ్వేంద్ర చహల్‌ కొత్త చరిత్ర

వార్నర్‌ ఇన్నింగ్స్‌ వీడియో కోసం క్లిక్‌ చేయండి

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top