
టీమిండియా-పాకిస్తాన్(ఫైల్ ఫోటో)
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఆసియాకప్-2025 మరో పది రోజుల్లో షూరూ కానుంది. తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 9న అబుదాబి వేదికగా అఫ్గానిస్తాన్, హాంకాంగ్ జట్లు తలపడనున్నాయి. మొత్తం ఈ టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గోనున్నాయి.
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టీమిండియా బరిలోకి దిగనుంది. ఇప్పటికే ఖండంతర టోర్నీ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు. ఓ మల్టీ నేషనల్ టోర్నమెంట్‌లో భారత జట్టు కెప్టెన్‌గా సూర్య వ్యవహరించడం ఇదే మొదటి సారి. ఈ మెగా ఈవెంట్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న దుబాయ్ వేదికగా యూఏఈ జట్టుతో తలపడనుంది.
అనంతరం సెప్టెంబర్ 14 హైవోల్టేజ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను భారత్ ఢీకొట్టనుంది. ఈ టోర్నమెంట్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ ఒకటి కంటే ఎక్కువసార్లు ముఖాముఖి తలపడే అవకాశముంది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియాకప్ టోర్నీలో క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వకుండా, తమ లాభాలను పెంచుకోవడమే కోసం బ్రాడ్‌కాస్టర్లు ప్రయత్నిస్తున్నారని అలీ మండిపడ్డాడు.
"క్రికెట్ ప్రస్తుతం డబ్బు సంపాదించే ఆటగా మరిపోయింది. నిజంగా ఇది దురదృష్టకరం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్రాంచైజ్ లీగ్‌లలో వ్యాపార ప్రయోజనాలకు అగ్రస్ధానం ఇస్తుండగా.. ఆ తర్వాత రెండో స్ధానం క్రికెట్‌కు ఇస్తున్నారు. ఇప్పుడు ఆసియాకప్‌లో కూడా అదే జరుగుతుంది.
ఈ టోర్నీలో పాకిస్తాన్, భారత్, శ్రీలంక గెలవదు. నిజమైన విజేతలు బ్రాడ్‌కాస్టర్లు అవుతారు. ఏ నిర్ణయమైనా మైదానంలో ఆటగాళ్లు కాదు, బ్రాడ్ కాస్టర్లే తీసుకుంటారు" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన అలీ పేర్కొన్నాడు. కాగా పెహల్గమ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తమయ్యాయి. దీంతో ఆసియాకప్‌లో పాక్‌తో మ్యాచ్‌ను భారత్ బహిష్కిరించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి.
కానీ విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) నుండి బీసీసీఐకి అనుమతి లభించింది. దీంతో భారత్-పాక్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరగనుంది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నిల్ ఇచ్చినప్పటికి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అనేక మంది మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. అదేవిధంగా పాక్-భారత్ మ్యాచ్‌కు సంబంధించి అధికారిక బ్రాడ్ క్రాస్టర్ సోనీ నెట్‌వర్క్ ఓ ప్రోమో విడుదల చేసింది. దీంతో సోనీపై కూడా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
చదవండి: DPL: బౌలర్లు ఇక కాస్కోండి.. జూనియర్ సెహ్వాగ్ వచ్చేస్తున్నాడు! వీడియో