Sanju Samson: మరీ ఇంత దరిద్రం ఏంటి భయ్యా! ఇలాగైతే ‘కెరీర్‌’కు ఎండ్‌ కార్డ్‌ పడ్డట్లే!

Ind Vs SL: Fans Says Bad Luck For Sanju Samson Injured Ruled Out - Sakshi

India Vs Sri Lanka T20 Series- Sanju Samson:మొన్నటి దాకా జట్టులో చోటే దక్కలేదు.. ఒకవేళ అడపాదడపా ఎంపికైనా తుది జట్టులో పేరు ఉంటుందా లేదా అన్న సందేహాలు.. దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటి ఎట్టకేలకు స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ఎంపిక.. కానీ చెత్త షాట్‌ సెలక్షన్‌తో వికెట్‌ పారేసుకోవడం సహా కీలక క్యాచ్‌ జారవిడవడం వంటి పరిణామాలు.. 

సరే.. ఈ ఒక్కసారికి తప్పు కాచి అందరిలాగే మరో అవకాశం ఇస్తారేమోలే అని అభిమానుల ఆశలు.. కానీ విధి వెక్కిరించింది.. చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన ఆ బ్యాటర్‌ను దురదృష్ట వెంటాడింది. మోకాలి గాయం కారణంగా సిరీస్‌కు దూరమవ్వాల్సి వచ్చింది. ఈ ఉపోద్ఘామంతా టీమిండియా వికెట్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ గురించే!

‘తొలి’ సిరీస్‌కు ఎంపిక
రంజీ ట్రోఫీ టోర్నీ 2022-23 సీజన్‌లో ఈ కేరళ కెప్టెన్‌ ఇటీవల వరుస అర్ధ శతకాలు బాదాడు. ఈ క్రమంలో మరోసారి బీసీసీఐ పిలుపు అందుకుని కొత్త ఏడాదిలో సొంత గడ్డపై జరుగనున్న తొలి సిరీస్‌కు ఎంపికయ్యాడు.

సీనియర్ల గైర్హాజరీలో హార్దిక్‌ పాండ్యా సారథ్యంలో వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ఆడే అవకాశం దక్కించుకున్నాడు సంజూ శాంసన్‌. టాపార్డర్‌ విఫలమై జట్టు కష్టాల్లో ఉన్న వేళ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు 6 బంతులు ఎదుర్కొని కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు.

చెత్త షాట్‌ సెలక్షన్‌
6.3వ ఓవర్‌లో లక్కీగా అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అతడు.. ఆ తర్వాతి రెండో బంతికే పెవిలియన్‌ చేరాడు. ఆఫ్‌ స్పిన్నర్లను అటాక్‌ చేయడాన్ని ఇష్టపడే సంజూ.. ఈసారి మాత్రం బంతిని అంచనా వేయలేక వికెట్‌ పారేసుకున్నాడు.  

ధనుంజయ డి సిల్వ బౌలింగ్‌లో దిల్షాన్‌ మధుషంకకు క్యాచ్‌ ఇచ్చి.. నిరాశగా వెనుదిరిగాడు. దీంతో రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడంటూ.. గావస్కర్‌ వంటి దిగ్గజాలు విమర్శించారు. ఒకవేళ మళ్లీ అవకాశం వస్తే టాలెంటెడ్‌ సంజూ కచ్చితంగా దానిని ఉపయోగించుకుంటాడని ఫ్యాన్స్‌ భావించారు.

వాళ్లంతా రేసులో మున్ముందుకు
కానీ.. గాయం కారణంగా సిరీస్‌ మొత్తనికి దూరమయ్యే దుస్థితి. మరోవైపు.. వన్డే జట్టు ఎంపిక నేపథ్యంలో సంజూను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోనేలేదు. ఇక శ్రేయస్‌ అయ్యర్‌ యువ వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌, శుబ్‌మన్‌ గిల్‌ వన్డే జట్టులో స్థానం సుస్థిరం చేసుకుని ప్రపంచకప్‌లో ఆడే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

సెలక్టర్లు పట్టించుకోనేలేదు!
ఇదిలా ఉంటే.. స్వదేశంలో జరుగనున్న ఈ మెగా టోర్నీకి పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యే క్రమంలో బీసీసీఐ.. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు సంబంధించి కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఐసీసీ ఈవెంట్‌ సహా మేటి జట్లతో సిరీస్‌లకు గానూ యో- యో టెస్టు సహా డెక్సా(ఎముకల పరిపుష్టి) టెస్టు ఫలితాల ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయనుంది. ఈ నేపథ్యంలో సంజూ ఫ్యాన్స్‌ ఆందోళనకు గురవుతున్నారు. 

దరిద్రం అంటే ఇదే! కెరీర్‌ ముగిసిపోయినట్లే!
‘‘మరీ ఇంత బ్యాడ్‌ లక్‌ ఏంటయ్యా? అవకాశాలే రావు.. వచ్చినా ఇలా గాయాలపాలు కావడం.. ప్రపంచకప్‌ ముందుంది.. తోటి ఆటగాళ్లంతా దూసుకుపోతున్నారు.. నీకేమో ఫిట్‌నెస్‌ సమస్యలు.. మరోవైపు కఠిన టెస్టులు.. నీ కెరీర్‌ ఏమవుతుందో!’’ అంటూ ఇందుకు సంబంధించి సోషల్‌ మీడియా వేదికగా చర్చిస్తున్నారు. మరికొంత మందేమో.. సంజూ అంతర్జాతీయ కెరీర్‌కు ఎండ్‌ కార్డ్‌ పడుతోందనడానికి ఇది సంకేతమా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్‌.. జట్టులోకి బుమ్రా.. బీసీసీఐ ప్రకటన
అపజయమెరుగని హార్ధిక్‌.. హిట్‌మ్యాన్‌ రికార్డు బద్దలు

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top