
ది హాండ్రడ్ లీగ్-2025లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీలో భాగంగా సోమవారం సౌతాంప్టన్ వేదికగా సదరన్ బ్రేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో ఇన్విన్సిబుల్స్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఇన్విన్సిబుల్స్ తమ టాప్ ప్లేస్‌ను మరింత పదిలం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్ జట్టు 98 బంతుల్లో 133 పరుగులకు ఆలౌటైంది.
ఓవల్ ఇన్విన్సిబుల్స్ కెప్టెన్ సామ్ కుర్రాన్, స్పిన్నర్ రషీద్ ఖాన్ చెరో మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధిని దెబ్బతీశారు. వారిద్దరితో పాటు బెహ్రెన్‌డార్ఫ్ రెండు, టామ్ కుర్రాన్ తలా వికెట్ సాధించారు. సదరన్ బ్రేవ్ బ్యాటర్లలో టాపర్డర్ విఫలం కాగా.. లోయార్డర్‌లో కార్ట్ రైట్(42), జే థామ్సన్(24) రాణాంచారు.
కాక్స్, కుర్రాన్ విధ్వంసం..
అనంతరం 134 పరుగుల లక్ష్య చేధనలో ఓపెనర్లు విల్ జాక్స్(1) , టవాండా ముయేయే(9) ఔట్ చేసి ఇన్విన్సిబుల్స్‌కు క్రెయిగ్ ఓవర్టన్ భారీ షాకిచ్చాడు. అయితే ఈ సమయంలో జోర్డాన్ కాక్స్(56), సామ్ కుర్రాన్(50 నాటౌట్) ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురు దాడికి దిగారు.
దీంతో ఓవల్ జట్టు లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి 89 బంతుల్లోనే చేధించింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన సామ్ కుర్రాన్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో ఆగస్టు 21న ట్రెంట్ రాకర్స్‌తో తలపడనుంది.