ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్సీబీతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పూర్తిగా తడబడుతోంది. ఆదిలోనే ఓపెనర్లిద్దరి వికెట్లను కోల్పోయిన గుజరాత్ కష్టాల్లో పడింది. అయితే హోంగ్రౌండ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు మంచి రికార్డే ఉంది. టాస్ ఓడినా, గెలిచినా 2025 నుంచి చూసుకుంటే అప్పటినుంచి గుజరాత్ టైటాన్స్ ఐదు మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసింది.
ఈ ఐదు మ్యాచ్‌ల్లోనూ గుజరాత్ విజయాలను సాధించింది. ఇందులో ముంబై ఇండియన్స్‌పై 36 పరుగులతో, రాజస్తాన్‌పై 58 పరుగులతో, ఎస్ఆర్‌హెచ్‌పై 38 పరుగులతో, ఎస్ఆర్‌హెచ్‌పై 82 పరుగులతో, సీఎస్కేపై 89 పరుగులతో విజయాలను అందుకుంది. అయితే ఈసారి జరుగుతున్న ఫైనల్లో మాత్రం గుజరాత్ టైటాన్స్‌కు సీన్ రివర్స్ అయ్యేలా కనిపిస్తుంది.
పైగా టాస్ సమయంలో గిల్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా అనిపించాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ పటీదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అహ్మదాబాద్ పిచ్‌పై చేజింగ్ చేసిన జట్టే ఎక్కువ విజయాలు అందుకుంది. అయితే గిల్ మాత్రం తాను టాస్ గెలిచి ఉంటే బ్యాటింగ్ ఎంచుకునేవాడినని చెప్పుకొచ్చాడు.
అయితే ఇప్పుడు తొలుత బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ గుజరాత్ ఆర్సీబీ బౌలర్లను ఎదుర్కోలేకపోతుంది. 8 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ 2 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. నిషాంత్ సిందూ (20), జాస్ బట్లర్ (10) పరుగులతో ఆడుతున్నారు.
🚨 Toss Update from the FINAL 🚨@RCBTweets have won the toss & will bowl first against @gujarat_titans in Ahmedabad.
Updates ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/kgrF0LJ0gQ— IndianPremierLeague (@IPL) May 31, 2026


