'అయ్యో షమీ.. రోహిత్‌ శర్మ కావాలనే అలా చేస్తున్నాడు' | Fans Reacts To Senior Pacer Mohammed Shami Absence From 2023 World Cup Ind Vs AFG Playing Xi - Sakshi
Sakshi News home page

WC 2023 IND Vs AFG: 'అయ్యో షమీ.. రోహిత్‌ శర్మ కావాలనే అలా చేస్తున్నాడు'

Oct 11 2023 4:12 PM | Updated on Oct 11 2023 4:59 PM

Fans react as India bench Mohammed Shami for 2023 World Cup tie vs AFG - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా ఢిల్లీ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో టీమిండియా తలపడతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆఫ్గానిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే భారత వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీకి మరోసారి తుది జట్టులో చోటు దక్కలేదు. ఆఫ్గాన్‌తో మ్యాచ్‌కు స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు విశ్రాంతి ఇచ్చిన జట్టు మేనెజ్‌మెంట్‌.. ఆల్‌రౌండర్‌ శార్ధూల్‌ ఠాకూర్‌కు తుది జట్టులో చోటు కల్పించింది.

ఈ నిర్ణయం తీసుకున్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు జట్టు మేనెజ్‌మెంట్‌పై ఫ్యాన్స్‌ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. షమీ భారత్‌కు కాకుండా వేరే దేశం తరపున ఆడాల్సింది, ఈజీగా ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు దక్కుతుందని ఓ నెటిజన్‌ ఎక్స్‌(ట్విటర్‌)లో రాసుకొచ్చాడు. మరి కొంతమంది అయితే రోహిత్‌ శర్మ కావాలనే షమీని తప్పిస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు. 

కాగా వరల్డ్‌కప్‌కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో షమీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొహలీ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఐదు వికెట్లతో షమీ అదరగొట్టాడు. అదే విధంగా వరల్డ్‌కప్‌లో కూడా షమీకి మంచి రికార్డు ఉంది. ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన 2019 వరల్డ్‌కప్‌లో ఆఫ్గానిస్తాన్‌పై షమీ హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టాడు. 
చదవండి: CWC 2023 BAN Vs ENG: ఇంగ్లండ్‌ చేతిలో ఖంగుతిన్న బంగ్లాదేశ్‌కు మరో షాక్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement