Suryakumar Yadav: సంచలనాల సూర్యకుమార్‌.. ఏడాదిలో ఎంత మార్పు

Fans Praise SuryaKumar How Crucial Batter For Team India Since 1-Year - Sakshi

సూర్యకుమార్‌ యాదవ్‌.. ప్రస్తుతం టీమిండియాలో ఒక సంచలనం. కోహ్లి తర్వాత టీమిండియాకు నమ్మదగిన బ్యాటర్లలో సూర్య ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. మంచి టెక్నిక్‌.. అవసరమైన దశలో దూకుడైన ఆటతీరు.. ఓపిక ఇలా అన్ని కలగలిపి ఒక పరిపూర్ణ బ్యాటర్‌గా తయారయ్యాడు. ప్రస్తుతం 'సూర్యుడి'లా వెలిగిపోతున్న అతన్ని ఆపడం ప్రత్యర్థి జట్లకు ఇక కష్టమే. 

ఈ ఏడాది ఇప్పటికే టి20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొత్త చరిత్ర సృష్టించిన సూర్యకుమార్‌ తాజాగా (నవంబర్‌ 2) విడుదల చేసిన టి20 ర్యాంకింగ్స్‌లో  అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. టి20 వరల్డ్‌కప్‌-2022లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న సూర్య భాయ్‌.. తొలిసారి టి20 ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠాన్ని అధిరోహించాడు.

దూకుడే మంత్రంగా కొనసాగుతున్న అతని ఆటపై రోజురోజుకు అభిమానం పెరుగుతుందే తప్ప తగ్గింది లేదు. టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై తక్కువ స్కోరుకే వెనుదిరిగిన సూర్యకుమార్‌.. నెదర్లాండ్స్‌పై తన విధ్వంసాన్ని కొనసాగించాడు. 21 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్‌ అందుకున్న సూర్య.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లోనూ అర్థసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓడినా.. సూర్య ఒక్కడే ఒంటరిపోరాటం చేశాడు. మ్యాచ్‌లో బరిలోకి దిగాడంటే ఫిఫ్టీ అంతకంటే ఎక్కువ పరుగులు చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు.  

గతేడాది సూర్యకుమార్‌ అంతగా ఫామ్‌లో లేడు. 2021 టి20 ప్రపంచకప్‌లో సూర్య ఆడినప్పటికి అంతగా ఆకట్టుకోలేకపోయాడు.  అంతేకాదు 2021లో టి20ల్లో 77వ ర్యాంక్‌లో ఉన్న సూర్య.. గతేడాది ఐపీఎల్‌లో స్థిరంగా రాణించాడు. ఆ తర్వాత అదే ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ టీమిండియాలో కీలక ఆటగాడిగా మారుతున్నాడు.

చదవండి: T20 WC 2022: పాక్‌ ఆశలపై నీళ్లు.. గాయంతో స్టార్‌ ప్లేయర్‌ ఔట్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top