
మాంచెస్టర్ టెస్ట్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 358 పరుగులకు ఆలౌటైంది. 264/4 వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 94 పరుగులు జోడించి మిగతా 6 వికెట్లు కోల్పోయింది.
తొలి రోజు ఆటలో గాయపడిన వికెట్‌కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఇవాళ వీరోచితంగా పోరాడి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇవాళ శార్దూల్ ఠాకూర్ ఔటయ్యాక రీఎంట్రీ ఇచ్చిన పంత్.. వాషింగ్టన్ సుందర్, అన్షుల్ కంబోజ్ సాయంతో భారత ఇన్నింగ్స్‌ను తీర్చిదిద్దాడు. పంత్ తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాక భారత ఇన్నింగ్స్ క్షణాల్లో ముగిసింది.
భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46, సాయి సుదర్శన్ 61, శుభ్‌మన్ గిల్ 12, రిషబ్ పంత్ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్ ఠాకూర్ 41, వాషింగ్టన్ సుందర్ 27, అన్షుల్ కంబోజ్ 0, జస్ప్రీత్ బుమ్రా 5, మహ్మద్ సిరాజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.
ఇవాల్టి ఆటలో ఇంగ్లండ్ బౌలర్ బెన్ స్టోక్స్ చెలరేగిపోయాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా అతను 5 వికెట్లు తీశాడు. ఆర్చర్‌కు సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్, డాసన్ తలో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.