CPL 2024: రాణించిన నూర్‌ అహ్మద్‌, సీఫర్ట్‌ | CPL 2024: Saint Lucia Kings Beat Barbuda Falcons By 7 Wickets | Sakshi
Sakshi News home page

CPL 2024: రాణించిన నూర్‌ అహ్మద్‌, సీఫర్ట్‌

Sep 4 2024 2:26 PM | Updated on Sep 4 2024 2:26 PM

CPL 2024: Saint Lucia Kings Beat Barbuda Falcons By 7 Wickets

కరీబియర్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024 ఎడిషన్‌లో సెయింట్‌ లూసియా కింగ్స్‌ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ టోర్నీలో ఆ జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లో జయభేరి మోగించింది. ఆంటిగ్వా అండ్‌ బార్బుడా ఫాల్కన్స్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలింగ్‌లో నూర్‌ అహ్మద్‌ (4-0-18-3), బ్యాటింగ్‌లో టిమ్‌ సీఫర్ట్‌ (11 బంతుల్లో 26 నాటౌట్‌; ఫోర్‌, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించి లూసియా కింగ్స్‌ను గెలిపించారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఫాల్కన్స్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. జట్టులో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. జస్టిన్‌ గ్రీవ్స్‌ (36), ఇమాద్‌ వసీం (29 నాటౌట్‌), ఫఖర్‌ జమాన్‌ (21) పర్వాలేదనిపించారు. లూసియా కింగ్స్‌ బౌలర్లలో నూర్‌ అహ్మద్‌తో పాటు డేవిడ్‌ వీస్‌, అల్జరీ జోసఫ్‌, రోస్టన్‌ ఛేజ్‌, ఖారీ పియెర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన లూసియా కింగ్స్‌.. 17 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సీఫర్ట్‌ మెరుపు వేగంతో పరుగులు చేయగా.. జాన్సన్‌ ఛార్టెస్‌ (46 బంతుల్లో 47 నాటౌట్‌) బాధ్యతాయుతంగా ఆడాడు. డుప్లెసిస్‌ 28, రాజపక్ష 9, అకీమ్‌ 27 పరుగులు చేశారు. ఫాల్కన్స్‌ బౌలర్లలో ఇమాద్‌ వసీం, క్రిస్‌ గ్రీన్‌, ఫేబియన్‌ అలెన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. లీగ్‌లో భాగంగా రేపు సెయింట్‌ కిట్స్‌, గయానా అమెజాన్‌ వారియర్స్‌ మధ్య మ్యాచ్‌ జరుగనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement