
లండన్‌లోని ఓవల్ వేదికగా భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్టు తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ పై చేయి సాధించింది. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ల ధాటికి టీమిండియా 6 కీలక వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. అయితే తొలి రోజు ఆట చివరిలో ఇంగ్లండ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ క్రిస్ వోక్స్‌కు తీవ్ర గాయమైంది. బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే ప్రయత్నంతో వోక్స్ భుజానికి గాయమైంది.
జెమీ ఓవర్టన్ వేసిన 57వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఓవర్‌లో ఐదో బంతిని కరుణ్ నాయర్ మిడాఫ్ దిశగా షాట్ ఆడాడు. ఈ క్రమంలో మిడాఫ్‌లో ఉన్న వోక్స్ బంతిని ఆపేందుకు పరిగెత్తుకుంటా వెళ్లాడు. ఆ ప్రయత్నంలో వోక్స్ ఎడమ భుజం నేలకు బలంగా తాకింది. దీంతో అతడు నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో సాయంతో ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్ మైదానాన్ని వీడాడు.
తర్వాత వెంటనే స్కానింగ్ కోసం అస్ప్రతికి తరలించారు. అతడి గాయం తీవ్రత చూస్తుంటే ఎడమ భుజం డిస్ లోకేట్ అయినట్లు అనిపిస్తోంది. వోక్స్ తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెట్టే సూచనలు కన్పించడం లేదు. అతడి గాయం తీవ్రతపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కాగా తొలి రోజు ఆటలో వోక్స్ ఓ వికెట్ సాధించాడు.
అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌ను వోక్స్ బోల్తా కొట్టించాడు. ఒకవేళ వోక్స్ దూరమైతే ఇంగ్లండ్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఇప్పటికే ఓవల్ టెస్టులో ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, ఆర్చర్ సేవలను కోల్పోయింది. ప్రస్తుతం జట్టులో వోక్స్ తప్ప అనుభవమున్న ఫాస్ట్ బౌలర్ మరొకరు లేరు.
చదవండి: IND vs ENG 5th Test: ఆధర్మసేన.. ఇంగ్లండ్‌కు ఫేవర్‌గా అంపైర్! ఫ్యాన్స్ ఫైర్