Chennai Super Kings Win 4th Title: 35+ ‘బాయ్స్‌’ సక్సెస్‌ స్టోరీ..!

Chennai Super Kings Special Story On IPL 2021 Winner - Sakshi

సాక్షి క్రీడా విభాగం: ‘మేం వచ్చేసారి బలంగా తిరిగొస్తాం... అభిమానులకు ఇదే నా సందేశం’... గత ఏడాది ఐపీఎల్‌లో చెత్త ప్రదర్శనతో ఏడో స్థానంలో నిలిచిన తర్వాత ధోని చేసిన వ్యాఖ్య ఇది. జట్టుపై, తనపై ఎంత నమ్మకముంటే ధోని ఇలాంటి మాటలు చెప్పగలడు. ఎందుకంటే అతను ధోని కాబట్టి! చూస్తుంటే టీమ్‌ పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. వయసు పెరిగిపోయి, ఫామ్‌ కోల్పోయి తంటాలు పడుతున్న ఆటగాళ్లతో ఈసారే కాలేదు, వచ్చే ఏడాది ఏమవుతుంది అని అన్ని వైపుల నుంచి వ్యంగ్య స్పందనలు. కానీ ఇలాంటి స్థితి నుంచి టీమ్‌ను నిజంగా విజేతగా నిలపడం అంటే అసాధారణం. 

సీఎస్‌కేకు తొలి సీజన్‌ నుంచి కర్త, కర్మ, క్రియ అన్నీ ధోనినే. జట్టు గెలిచినా, ఓడినా, చాంపియన్‌షిప్‌లు సాధించినా అంతా అతని సారథ్యం అనడంలో సందేహం లేదు. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కూడా ఇదే నమ్మింది. ఇన్నేళ్ల విజయాల్లో భిన్న ఆటగాళ్లు తమదైన పాత్ర పోషించారు. కానీ మారనిది ధోని, అతని వ్యూహ చతురతే! సరిగ్గా చెప్పాలంటే ఈ సీజన్‌లో 40 ఏళ్ల ధోని బ్యాటింగ్‌ చూస్తే సూపర్‌ కింగ్స్‌ పది మంది ఆటగాళ్లు, ఒక కెప్టెన్‌తో ఆడినట్లు ఉంది. కేవలం నాయకత్వం కారణంగానే అతను టీమ్‌లో ఉన్నాడనేది వాస్తవమైతే అతను నాయకుడిగా ఉన్నాడు కాబట్టే టీమ్‌ ఇలా పురోగమించిందనేది కూడా అంతకంటే వాస్తవం!  

చెన్నై టీమ్‌లో ఐదుగురు ఆటగాళ్లు 35 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు. టి20లు అనగానే ఈ విషయంలో కాస్త సంశయం కనిపిస్తుంది. అయితే బరిలోకి దిగి అద్భుతాలు చేసేందుకు వారికి వయసు అడ్డు రాలేదు. వీరంతా టీమ్‌ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. 37 ఏళ్ల డు ప్లెసిస్‌ ఏకంగా 633 పరుగులతో సత్తా చాటి ఓపెనర్‌గా శుభారంభాలు అందించాడు. 38 ఏళ్ల బ్రావో 14 కీలక వికెట్లు తీసి తాను చెన్నై బృందంలో సుదీర్ఘ కాలంగా ఎందుకు కొనసాగుతున్నాడో చూపించాడు. 34 ఏళ్ల సీనియర్, అత్యంత విజయవంతమైన చెన్నై ఆటగాడు సురేశ్‌ రైనా ఫామ్‌ కోల్పోయి తంటాలు పడుతుంటే మరో 35 ఏళ్ల రాబిన్‌ ఉతప్పను తుది జట్టులోకి తీసుకొని చేసిన వ్యూహం సూపర్‌గా పేలింది. తొలి క్వాలిఫయర్‌లో మెరుపు బ్యాటింగ్‌ చేసిన ఉతప్ప, ఫైనల్లో జట్టు ఒత్తిడిలోకి వెళుతున్న సమయంలో 3 సిక్సర్లతో ఆట మార్చేశాడు.

36 ఏళ్ల రాయుడు కూడా కీలక సమయంలో రెండు అర్ధ సెంచరీలతో తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇక ఐపీఎల్‌ గెలిచిన తొలి ఇంగ్లండ్‌ ఆటగాడిగా నిలిచిన 34 ఏళ్ల మొయిన్‌ అలీని కూడా ధోని సమర్థంగా వాడుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లతో పాటు అతని చక్కటి ఫీల్డింగ్‌ జట్టుకు ఎంతో పనికొచ్చాయి. ఎప్పటిలాగే రవీంద్ర జడేజా తనదైన శైలిలో అన్ని రంగాల్లో రాణించడం చెన్నై బలాన్ని పెంచింది. ఇక టీమ్‌ ప్రస్థానంలో చెప్పుకోదగ్గ పేరు రుతురాజ్‌ గైక్వాడ్‌. గత ఏడాది ఐపీఎల్‌ సమయంలో అనూహ్యంగా కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత ఆరంభంలో విఫలమైనా... చివరి మ్యాచ్‌లలో సత్తా చాటాడు. ఈసారి తనలోని పూర్తి స్థాయి ఆటను చూపిస్తూ సెంచరీ సహా 635 పరుగులు సాధించడం చెన్నై టైటిల్‌ విజయంలో కీలకంగా మారింది. వీరందరినీ సమర్థంగా వాడుకుంటూ ధోని నడిపించిన తీరు నాయకుడిగా అతని వన్నె ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది.

చివరగా... వచ్చేసారి ఐపీఎల్‌లో మెగా వేలం ఉన్న నేపథ్యంలో ఇంకా నియమ నిబంధనలు ఏమిటనేది బీసీసీఐ ఇంకా స్పష్టం చేయలేదు. అయితే విజేతలుగా నిలిచిన ఈ టీమ్‌లోని సభ్యుల్లో కూడా ఎంత మంది మళ్లీ ఐపీఎల్‌లో కనిపిస్తారనేది వేర్వేరు కారణాలతో సందేహమే. ఒకవేళ ఆడినా ఇదే సక్సెస్‌ఫుల్‌ టీమ్‌ ఒక్క చోటికి చేరడం సహజంగానే కష్టం. ఈ నేపథ్యంలో వీరు సాధించిన విజయపు ఘనత చిన్నదేమీ కాదు. చెన్నై ఫ్యాన్స్‌ మాత్రమే కాదు, సగటు క్రికెట్‌ అభిమాని కూడా... ఏం ఆడిందిరా ఈ టీమ్‌ అనేలా ఘనంగా చెన్నై ముగింపు పలికింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

17-10-2021
Oct 17, 2021, 06:05 IST
ప్రతీ ఫైనల్‌ ప్రత్యేకమే. ఫైనల్లో ఎక్కువసార్లు ఓడిన జట్టు కూడా మాదే. అయితే పడ్డ ప్రతీసారి కోలుకొని పైకి లేవడం...
17-10-2021
Oct 17, 2021, 05:53 IST
టి20 ఫార్మాట్‌లో అత్యధిక టైటిల్స్‌ గెలిచిన ప్లేయర్‌గా వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో రికార్డు నెలకొల్పాడు. 15 టైటిల్స్‌తో వెస్టిండీస్‌కే...
17-10-2021
Oct 17, 2021, 01:03 IST
ఐపీఎల్‌లో మళ్లీ ‘విజిల్‌ పొడు’... పసుపు మయమైన దుబాయ్‌ మైదానంలో తమ ఆరాధ్య ఆటగాడు మాహి మళ్లీ ఐపీఎల్‌ ట్రోఫీతో...
16-10-2021
Oct 16, 2021, 16:21 IST
MS Dhoni And Sakshi Dhoni Expecting Their Second Child In 2022: ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను...
16-10-2021
Oct 16, 2021, 09:48 IST
IPL 2021 Prize Money: విజేతకు రూ. 20 కోట్లు.. మరి వాళ్లదంరికీ ఎంతంటే?!
16-10-2021
Oct 16, 2021, 08:56 IST
Faf Du Plessis: రుతు ప్రతిభావంతుడు.. భవిష్యత్తు గొప్పగా ఉంటుంది
16-10-2021
Oct 16, 2021, 08:08 IST
MS Dhoni: ఇప్పుడు నేను చెన్నైలోని చెపాక్‌లోనే ఉన్నట్లుగా భావిస్తున్నా. థాంక్స్‌ టూ ఫ్యాన్స్‌!
16-10-2021
Oct 16, 2021, 00:27 IST
IPL 2021 Winner CSK Video Viral: గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా...
15-10-2021
Oct 15, 2021, 23:30 IST
IPL 2021 Winner CSK: చెన్నై సూపర్‌ కింగ్స్‌ ‘ఫోర్‌’ కొట్టేసింది. దుబాయ్‌ వేదికగా జరిగిన ఐపీఎల్‌-2021 ఫైనల్‌ మ్యాచ్‌లో...
15-10-2021
Oct 15, 2021, 23:30 IST
ఐపీఎల్‌ 2021 టైటిల్‌ విజేత సీఎస్‌కే ఐపీఎల్‌లో సీఎస్‌కే నాలుగోసారి చాంపియన్‌గా నిలిచింది. కేకేఆర్‌తో జరిగిన ఫైనల్లో సీఎస్‌కే 27 పరుగుల...
15-10-2021
Oct 15, 2021, 23:11 IST
Nitish Rana Golden Duck.. గోల్డెన్‌ డక్‌ విషయంలో కేకేఆర్‌ బ్యాటర్‌ నితీష్‌ రాణా చెత్త రికార్డు నమోదు చేశాడు. 2020...
15-10-2021
Oct 15, 2021, 22:24 IST
Dinesh Karthik Speaking Telugu In IPL 2021 Final: 2021 ఐపీఎల్‌ ఫైనల్ సందర్భంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్‌కీపర్‌...
15-10-2021
Oct 15, 2021, 22:22 IST
IPL 2021 FInal: ఐపీఎల్‌-2021 విజేతగా నిలిచేందుకు చెన్నై సూపర్‌కింగ్స్‌- కోల్‌కతా నైట్‌రైడర్స్‌ హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఎప్పటిలాగే చెన్నై ఓపెనర్లు...
15-10-2021
Oct 15, 2021, 22:04 IST
Lockie Ferguson.. సీఎస్‌కేతో జరుగుతున్న ఐపీఎల్‌ 2021 ఫైనల్ మ్యాచ్‌లో కేకేఆర్‌ బౌలర్‌ లోకి ఫెర్గూసన్‌ చెత్త రికార్డు నమోదు...
15-10-2021
Oct 15, 2021, 20:51 IST
CSK Opener Ruturaj Gaikwad Became Youngest Orange Cap Holder In IPL History: ఐపీఎల్‌ చరిత్రలో చెన్నై...
15-10-2021
Oct 15, 2021, 20:24 IST
Ruturaj Gaikwad And Faf Du Plesis.. కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే ఒక అరుదైన రికార్డు సాధించింది. ఓపెనర్లు రుతురాజ్‌...
15-10-2021
Oct 15, 2021, 18:16 IST
CSK Players Set To Reach Milestones In IPL 2021 Final Match Against KKR: చెన్నై సూపర్...
15-10-2021
Oct 15, 2021, 17:55 IST
Virat Kohli Shows Life In Bio Bubble.. ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి ఐపీఎల్‌ 2021 టైటిల్‌ అందుకోవడంలో మరోసారి...
15-10-2021
Oct 15, 2021, 17:11 IST
MS Dhoni As First Captain As 300 T20 Matches.. సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ముందు అరుదైన రికార్డు...
15-10-2021
Oct 15, 2021, 17:09 IST
David Warner Shares Pic In CSK Jersey Ahead Of IPL 2021 Final: చెన్నై సూపర్‌ కింగ్స్‌,... 

Read also in:
Back to Top