ఆర్సీబీ, కేఎస్‌సీఏలకు షాక్‌ | Bengaluru Stampede Incident: Case Filed Against RCB And KSCA | Sakshi
Sakshi News home page

ఆర్సీబీ, కేఎస్‌సీఏలకు షాక్‌

Jun 5 2025 6:36 PM | Updated on Jun 5 2025 7:48 PM

Bengaluru Stampede Incident: Case Filed Against RCB And KSCA

బెంగళూరు:  ఐపీఎల్‌ టైటిల్‌ను ఎట్టకేలకు గెలిచామన్న ఆనందం ఐపీఎల్‌ ఫ్రాంచైజీ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ)కి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఆర్సీబీ టైటిల్‌ సాధించిన తర్వాత నిన్న(బుధవారం, జూన్‌ 4వ తేదీ)  బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృత్యువాత పడ్డారు. 

దాంతో  ఇది పొలిటికల్‌ టర్న్‌ తీసుకోవడమే కాకుండా హైకోర్టు వరకూ వెళ్లింది.  ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హైకోర్టు.. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఏజీని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్‌ అసోసియేన్‌లపై కేసు బుక్‌ చేశారు కర్ణాటక పోలీసులు.  

ఈ తొక్కిసలాట ఘటనను సుమోటోగా స్వీకరించిన పోలీసులు.. ఆర్సీబీ, కేఎస్‌సీఏలపై కేసు నమోదు చేశారు.  అనంతరం దీన్ని క్రిమినల్‌ ఇన్విస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌(సీఐడీ)కి అప్పగించారు. 

అదే సమయంలో ఈ ఘటనకు సంబంధించి పూర్తి విచారణలో భాగంగా కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన  జిల్లా మేజిస్ట్రేట్‌ జి. జగదీషా కేఎస్‌సీఏ, ఆర్సీబీలకు నోటీసులు పంపనున్నారు. 

బెంగళూరు తొక్కిసలాట ఘటనపై హైకోర్టు ఆగ్రహం

 


 

Advertisement
 
Advertisement
Advertisement