BCCI announces schedule for home series against Australia, 2nd ODI in Vizag - Sakshi
Sakshi News home page

Ind Vs Aus ODI Series: ఆసీస్‌తో టీమిండియా ఢీ.. వైజాగ్‌లో మ్యాచ్‌

Dec 8 2022 1:53 PM | Updated on Dec 8 2022 3:19 PM

BCCI Release Schedule 2 Matches In Hyderabad And Vizag - Sakshi

తెలుగు రాష్ట్రాల్లోని టీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్‌! వచ్చే ఏడాది న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా భారత పర్యటన నేపథ్యంలో రెండు మ్యాచ్‌లకు తెలంగాణ, ఆంధ్రపదేశ్‌ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. కివీస్‌తో 2023లో టీమిండియా మొదటి వన్డేకు హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వేదిక కానుంది. జనవరి 18న ఈ మ్యాచ్‌ జరుగనుంది.

అదే విధంగా.. మార్చి 19న ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌ వైజాగ్‌లోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో జరుగనుంది. ఈ మేరకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి గురువారం విడుదల చేసిన షెడ్యూల్‌లో వివరాలు పొందుపరిచింది. 

న్యూజిలాండ్‌ భారత పర్యటన షెడ్యూల్‌
►మూడు వన్డేలు- మూడు టీ20లు
►జనవరి 18- ఫిబ్రవరి 1
వేదికలు: హైదరాబాద్‌, రాయ్‌పూర్‌, ఇండోర్‌, రాంచి, లక్నో, అహ్మదాబాద్‌.

ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటన
►నాలుగు టెస్టులు- మూడు వన్డేలు
►ఫిబ్రవరి 13- మార్చి 22
వేదికలు: నాగ్‌పూర్‌, ఢిల్లీ, ధర్మశాల, అహ్మదాబాద్‌, ముంబై, వైజాగ్‌, చెన్నై. 
పూర్తి షెడ్యూల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి!

చదవండి: Rohit Sharma: సగం సగం ఫిట్‌నెస్‌! ఓటమికి ప్రధాన కారణం వాళ్లే! ఇప్పటికైనా...
IND vs BAN: వరుసగా రెండు సెంచరీలు.. రోహిత్‌ స్థానంలో జట్టులోకి! ఎవరీ ఈశ్వరన్?

Advertisement
 
Advertisement
Advertisement