Australia Tour Of Pakistan: 24 ఏళ్ల తర్వాత మళ్లీ పాక్‌ గడ్డపై సిరీస్‌

Australia Tour Of Pakistan After 24 Years Playing 3 Tests-3ODIs-One T20 - Sakshi

పాకిస్తాన్‌ గడ్డపై ఆస్ట్రేలియా 24 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి సిరీస్‌ ఆడనుంది. వచ్చే మార్చి- ఏప్రిల్‌ నెలలో పాకిస్తాన్‌లో పర్యటించనున్న ఆస్ట్రేలియా మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టి20 మ్యాచ్‌ ఆడనుంది. ఈ మేరకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు, క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) ఒప్పందం చేసుకున్నాయి. వాస్తవానికి గతేడాది నవంబర్‌లోనే ఈ సిరీస్‌ జరగాల్సి ఉన్నప్పటికి సెక్యురిటీ కారణాల రిత్యా ఆస్ట్రేలియా పర్యటనను వాయిదా వేసుకుంది.

చదవండి: హార్దిక్‌ పాండ్యాపై నిప్పులు చెరిగిన కోహ్లి చిన్ననాటి కోచ్‌

కాగా తొలుత టెస్టు సిరీస్‌తో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా పర్యటన టి20 మ్యాచ్‌తో ముగుస్తుంది. తొలి టెస్టు రావల్పిండి.. రెండో టెస్టు కరాచీ.. మూడో టెస్టు లాహోర్‌ వేదికగా జరగనుంది. మూడు వన్డేలు సహా ఏకైక టి20 మ్యాచ్‌ రావల్పిండి వేదికగానే నిర్వహించనున్నారు. కాగా మార్క్‌ టేలర్‌ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు  చివరిసారిగా 1998లో పాకిస్తాన్‌లో పర్యటించింది. అప్పట్లో పాక్‌ గడ్డపై మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆసీస్‌ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇక ఆస్ట్రేలియా ఇటీవలే ఇంగ్లండ్‌తో ముగిసిన యాషెస్‌ సిరీస్‌ను 4-0తో గెలుచుకొని సూపర్‌ ఫామ్‌లో ఉంది.

చదవండి: Under-19 World Cup: అప్పుడు కుర్రాళ్లు.. ఇప్పుడు సూపర్‌స్టార్లు

ఆస్ట్రేలియా టూర్‌ ఆప్‌ పాకిస్తాన్‌:
మార్చి 4-8: తొలి టెస్టు, రావల్పిండి
మార్చి 12-16: రెండో టెస్టు, కరాచీ
మార్చి 21-25: మూడో టెస్టు, లాహోర్‌

మార్చి 29: తొలి వన్డే, రావల్పిండి
మార్చి 31: రెండో వన్డే,రావల్పిండి
ఏప్రిల్‌ 2: మూడో వన్డే, రావల్పిండి

ఏప్రిల్‌ 5: ఏకైక టి20 మ్యాచ్‌, రావల్పిండి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top