Asia Cup 2022 IND VS PAK: పాక్‌ పేసర్‌కు ఆటోగ్రాఫ్‌ చేసిన జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చిన కోహ్లి

Asia Cup 2022 IND VS PAK: Virat Kohli Gifts Signed Jersey To Haris Rauf - Sakshi

ఎంత ప్రత్యర్ధినైనా.. ఇరు దేశాల మధ్య ఎంతటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా.. తాను మాత్రం కోహ్లికి వీరాభిమానినే అంటున్నాడు పాకిస్థాన్‌ యువ పేసర్‌ హరీస్‌ రౌఫ్‌. ఆసియా కప్‌లో నిన్న (ఆగస్ట్‌ 28) టీమిండియా చేతిలో ఓటమి అనంతరం  రౌఫ్‌.. తన ఆరాధ్య ఆటగాడితో ముచ్చటిస్తూ అన్న మాటలవి. ఈ సందర్భంగా రౌఫ్‌.. ఆటోగ్రాఫ్‌ చేసిన జెర్సీని తనకు గిఫ్ట్‌ ఇవ్వవలిసిందిగా కోహ్లిని కోరాడు. ఇందుకు  ఏమాత్రం సంశయించని కోహ్లి.. తన అభిమాన అటగాడి కోరిక నేరవేర్చాడు. విరాట్‌ నుంచి కానుక అందుకున్న అనంతరం రౌఫ్‌ చాలా సంతోషంగా కనిపించాడు. కోహ్లి సైతం రౌఫ్‌ కెరీర్‌కు బెస్ట్‌ విషెస్‌ చెప్పాడు. 

దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ఇవాళ సాయంత్రం ట్విటర్‌లో షేర్‌ చేసింది. షేర్‌ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది. ఫామ్‌లో లేకపోతేనేం కోహ్లి ఎప్పటికీ కింగేనని అతని అభిమానులు సంబురపడిపోతున్నారు. ఇదిలా ఉంటే, నిన్న పాక్‌తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. హార్ధిక్‌ పాండ్యా ఆల్‌రౌండ్‌ షో, భువీ బౌలింగ్‌ మెరుపులు.. కోహ్లి, జడేజా బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌ కారణంగా టీమిండియా దాయాదిపై అపురూపమైన విజయం సాధించింది. 
చదవండి: రికార్డులు తిరగరాసిన ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top