విజయాల్లో ధోనితో సమానంగా నిలిచాడు | Asghar Afghan Equals MS Dhoni Record Of Most Wins As T20I Captain | Sakshi
Sakshi News home page

విజయాల్లో ధోనితో సమానంగా నిలిచాడు

Mar 20 2021 9:45 AM | Updated on Mar 20 2021 1:44 PM

Asghar Afghan Equals MS Dhoni Record Of Most Wins As T20I Captain - Sakshi

అబుదాబి: అఫ్ఘనిస్తాన్‌ టీ20 కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ అరుదైన రికార్డు సాధించాడు. టీ20ల్లో అతని నాయకత్వంలో ఆప్ఘన్‌ జట్టు  41 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించడం ద్వారా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోని రికార్డును సమం చేశాడు. ఇప్పటి వరకు అస్గర్ అఫ్గాన్ 51 మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించగా.. ఇందులో 41 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కాగా టీమిండియా తరపున ఎంఎస్‌ ధోని.. తన కెరీర్‌లో 72 టీ20 మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ వహించగా.. ఇందులో 41 మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది.

విజయాల శాతం పరంగా చూసుకుంటే.. ధోనీ 59.28 శాతం విజయాల్ని సొంతం చేసుకోగా.. అస్గర్ అఫ్గాన్ ఏకంగా 81.37 శాతం విజయాల్ని నమోదు చేయడం గమనార్హం.యూఏఈ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన అఫ్గానిస్థాన్ టీమ్.. 2-0తో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ని కైవసం చేసుకుంది. అబుదాబి వేదికగా తాజాగా జరిగిన రెండో టీ20లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ టీమ్ 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో తడబడిన జింబాబ్వే 17.1 ఓవర్లలోనే 148 పరుగులకే కుప్పకూలింది.
చదవండి:
సన్యాసి అవతారంలో ధోని.. షాక్‌లో అభిమానులు

రోహిత్‌ అత్యాశపరుడు.. ధోని షాకింగ్‌ వీడియో..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement