ధోని రికార్డును బ్రేక్‌ చేశాడు...

Asghar Afghan Breaks MS Dhoni Record - Sakshi

అబుదాబి: జింబాబ్వేతో జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ 47 పరుగులతో విజయం సాధించి సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. అస్గర్‌ కెప్టెన్సీలోని అఫ్గాన్‌ జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగి 20 ఓవర్లలో 7 వికెట్లకు 183 పరుగులు చేసింది. నజీబుల్లా జద్రాన్‌ (35 బంతుల్లో 72 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగాడు. ఉస్మాన్‌ ఘనీ (39; 4 ఫోర్లు, 1 సిక్స్‌), అస్గర్‌ (12 బంతుల్లో 24; 1 ఫోరు, 2 సిక్స్‌లు) కూడా తోడవ్వడంతో అఫ్గానిస్తాన్‌ భారీ స్కోరు సాధించింది. అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 5 వికెట్లకు 136 పరుగులు చేసి ఓడిపోయింది. సికిందర్‌ రజా (41 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌), ర్యాన్‌ బుర్ల్‌ (31 బంతుల్లో 39 నాటౌట్‌; 1 ఫోరు, 3 సిక్స్‌లు) రాణించారు. నజీబుల్లాకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’.... సిరీస్‌లో 100 పరుగులతో పాటు ఐదు వికెట్లు తీసిన అఫ్గాన్‌ ఆల్‌రౌండర్‌ కరీమ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు లభించింది.  ఇక్కడ చదవండి: వైరల్‌: బట్లర్‌ తీరుపై కోహ్లి ఆగ్రహం

ధోని రికార్డును బ్రేక్‌ చేసిన అస‍్గర్‌
ఇదిలా ఉంచితే,  అఫ్గానిస్తాన్‌ టీ20 కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ ఈ ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా నిలిచాడు.  అంతర్జాతీయ టీ20ల్లో 42 విజయాలను సాధించిన కెప్టెన్‌గా నయా రికార్డు లిఖించాడు. అస్గర్‌ సారథ్యంలో అఫ్గానిస్తాన్‌ 42 విజయాలు సాధించింది. అస్గర్‌ 52 టీ20 మ్యాచ్‌లకు అఫ్గాన్‌ తరఫున నాయకత్వం వహించగా, అందులో 42 విజయాలు సాధించడం విశేషం. ఇక టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని 72 టీ20 మ్యాచ్‌లకు సారథ్యం వహించి 41 మ్యాచ్‌ల్లో విజయాలు అందించాడు. ఇది ఇప్పటివరకూ ధోని పేరిట ఉండగా, తాజాగా అస్గర్‌ పేరిట లిఖించబడింది.  ఆస్గర్‌, ధోని తర్వా త స్థానాల్లో టీ20ల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ ఉన్నాడు. మోర్గాన్‌ ఇప్పటివరకూ 59 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసి 33 విజయాలను అందించాడు. ఇక టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇప్పటివరకూ 45 మ్యాచ్‌లకు సారథ్యం వహించి 27 విజయాలను దక్కించుకున్నాడు. ఈ జాబితాలో కోహ్లి ఏడో స్థానంలో ఉన్నాడు. ఇక్కడ చదవండి: కోహ్లి ఓపెనింగ్‌ చేస్తే నాకు అభ్యంతరమేంటి!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top