
ఆసియాకప్-2025కు టీమిండియా తమ సన్నాహాకాలను ప్రారంభించింది. ఇప్పటికే దుబాయ్‌కు చేరుకున్న భారత జట్టు శుక్రవారం తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గోంది. మరో మూడు రోజుల పాటు ఐసీసీ అకాడమీలో ఏర్పాటు స్పెషల్ ట్రైనింగ్ క్యాంపులో భారత ఆటగాళ్లు చెమటోడ్చనున్నారు.
మెన్ ఇన్ బ్లూ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గురించి వెటరన్ ఆటగాడు అజింక్య రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా తరపున అద్బుతంగా రాణిస్తున్నప్పటికి, అక్షర్‌కు తగినంత గుర్తింపు దక్కలేదని రహానే తెలిపాడు.
"అక్షర్ పటేల్ ఒక అండర్‌రేటెడ్ ప్లేయర్ అని నేను భావిస్తున్నాను. గత రెండు, మూడేళ్లలో అతడు ఒక క్రికెటర్‌గా అతడు చాలా మెరుగుపడ్డాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అద్బుతంగా రాణిస్తున్నాడు. తనకు వచ్చినప్పుడల్లా బ్యాటర్‌గా, బౌలర్‌గా తన మార్క్‌ను చూపిస్తున్నాడు.
పవర్ ప్లేలో కొత్త బంతితో బౌలింగ్ చేసే సత్తా కూడా అక్షర్‌కు ఉంది. మిడిల్ ఫేజ్‌లో కూడా బౌలింగ్ చేయగలడు. అవసరమైతే డెత్ ఓవర్లలో బంతితో మ్యాజిక్ చేయగలడు. అక్షర్ లాంటి ఆటగాడు జట్టులో ఉంటే కెప్టెన్ ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. అక్షర్ ఫీల్డింగ్‌లో కూడా అద్బుతాలు చేయగలడు. ఆసియాకప్ దుబాయ్‌లో జరగనుంది. అక్కడి పిచ్‌లు ఎక్కువగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయి.
కాబట్టి అక్షర్ జట్టుకు ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారనున్నాడు" అని యూట్యూబ్ ఛానల్‌లో రహానే పేర్కొన్నాడు. కాగా ఆసియాకప్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో అక్షర్ సభ్యునిగా ఉన్నాడు. అయితే భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్సీ నుంచి మాత్రం పటేల్‌ను తప్పించారు. అతడి స్దానంలో శుబ్‌మన్ గిల్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు.
చదవండి: ODI WC 2027: ఇంగ్లండ్‌కు డేంజర్ బెల్స్.. వన్డే వరల్డ్ కప్‌కు డైరెక్ట్ ఎంట్రీ కష్టమే!?