మళ్లీ వస్తా.. మీతోనే ఉంటా | - | Sakshi
Sakshi News home page

మళ్లీ వస్తా.. మీతోనే ఉంటా

Oct 15 2026 8:00 AM | Updated on Oct 15 2026 8:00 AM

బీఆర్‌ఎస్‌ శ్రేణులకు కేటీఆర్‌ భరోసా

బీఆర్‌ఎస్‌ శ్రేణులకు కేటీఆర్‌ భరోసా

గజ్వేల్‌: గజ్వేల్‌కు మరోసారి వచ్చి రోజంతా మీతోనే ఉంటానని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శ్రేణులకు భరోసా ఇచ్చారు.బుధవారం గోదావరిఖనిలోని సింగరేణి కార్మిక గర్జన బహిరంగ సభకు వెళ్తున్న కేటీఆర్‌ గజ్వేల్‌ మండలం రిమ్మనగూడ వద్ద ఆగారు. ఈ సందర్భంగా ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని కేటీఆర్‌కు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్థానిక నాయకులు, కార్యకర్తలతో కేటీఆర్‌ ఆప్యాయంగా మాట్లాడుతూ మరోసారి గజ్వేల్‌కు వస్తానని, ఆ రోజంతా మీతోనే ఉంటానని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు హామీ ఇచ్చి గోదావరిఖనిలో జరుగనున్న బహిరంగ సభకు వెళ్ళారు. కేటీఆర్‌ వ్యాఖ్యలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గంగిశెట్టి చందనతో పాటు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement