వాళ్లు నాటుడు.. వీళ్లు నరుకుడు
పెద్దకోడూరులో రోడ్డుకు ఇరువైపులా
పెద్ద పెద్ద వృక్షాలు (నాడు)
చెట్లు నరకడంతో బోసిపోయిన రోడ్డు (నేడు)
చిన్నకోడూరు(సిద్దిపేట): పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం అభాసుపాలవుతోంది. మొక్కలు నాటి వాటిని సంరక్షించిన అధికారులు. మరోవైపు విద్యుత్ అధికారులు ఏపుగా పెరిగిన చెట్లను నరికివేస్తున్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి మొక్కలను సంరక్షించినా విద్యుత్ తీగలకు అడ్డంగా ఉన్నాయని అధికారులు నరికేస్తున్నారు. పెద్దకోడూరు శివారులో ఏళ్ల నాటి పచ్చని చెట్లు నరికి వేయడంతో బోసి పోయి కనిపిస్తోంది .


