హుస్నాబాద్: కోతుల బారి నుంచి రక్షించాలంటూ పిల్లలు మొరపెట్టుకున్నారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన చిన్న పిల్లలు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందించారు. తాము ఇంట్లో నుంచి బయటికి వెళ్దామంటే కోతులు దాడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దసరా సెలవుల్లో కూడా ఇంటి బయటకు వచ్చి ఆడుకోలేక పోతున్నామని వాపోయారు. చాలా సార్లు కోతుల దాడులకు గురయ్యామని తెలిపారు. కార్యక్రమంలో టీచర్స్ కాలనీ పిల్లలు తదితరులు ఉన్నారు.
గజ్వేల్ వైద్యవిద్యార్థినికి
బంగారు పతకం
గజ్వేల్: కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం ప్రకటించిన పీజీ వైద్యుల ఉత్తీర్ణత ఫలితాల్లో గజ్వేల్‌కు చెందిన డాక్టర్ గుడ్డోజు సునంద ఎంఎస్–ఈఎన్టీ విభాగంలో తెలంగాణలోనే అత్యధిక మార్కులతో డిస్టింక్షన్లో మొదటి ర్యాంకు సాధించి బంగారు పతకాన్ని కై వసం చేసుకున్నది. పట్టణానికి చెందిన గుడ్డోజు కృష్ణమూర్తి–సునీత దంపతుల కుమార్తె సునంద ఎంబీబీఎస్ ఎల్బీనగర్లోని కామినేని మెడికల్ పూర్తి చేశారు. అ తర్వాత పీజీ(ఎంఎస్–ఈఎన్టీ)ని కాళోజి నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని మెయినాబాద్ భాస్కర మెడికల్ కళాశాలలో పూర్తి చేశారు. ఆ విద్యార్థిని ప్రతిభపై పట్టణంలో అభినందనలు వెల్లువెత్తాయి.
సమస్యలు పరిష్కరించండి
ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్
సిద్దిపేటరూరల్: నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ఉద్యోగ భద్రత, వేతన సంబంధిత సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఎన్హెచ్ఎం ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలను అందజేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకే శాంతియుతంగా తమ నిరసనను వ్యక్తం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్హెచ్ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడు కాల్వ చక్రధ ర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, అసోసియే ట్ ప్రెసిడెంట్ భాస్కర్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రాజు గౌడ్, ఎన్ హెచ్ఎం జిల్లా కోఆర్డినే టర్ రాజు, మహిళా వింగ్ అధ్యక్షురాలు శోభ, ఉపాధ్యక్షులు నాగేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోండి
దుబ్బాక: నిబంధనలకు విరుద్ధంగా పాత సామగ్రి విక్రయించిన దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకో వాలని మంగళవారం తహసీల్దార్ కు సీపీఎం నాయకులు వినతిపత్రం అందించారు. దీనిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు గొడ్డుబర్ల భాస్కర్, సాజిద్, కొంపల్లి భాస్కర్, ఎల్లయ్య, మహేష్ తదితరులు ఉన్నారు.
స్వచ్ఛతను మరిచిన పాలకులు
హుస్నాబాద్‌రూరల్: పల్లెల్లో చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. గ్రామాలను స్వచ్ఛతగా ఉంచాలని ప్రభుత్వం డంపింగ్ యార్డులను నిర్మించినా అధికారుల పర్యవేక్షణ లోపంతో పారిశుద్ధ్యం లోపిస్తోంది. పందిల్ల ఎస్సీ కాలనీలో పేదల నివాసల సమీపంలోనే చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. పాలకులకు ఇది కన్పించడం లేదా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. చెత్తను తొలగించి పేదల వాడలను స్వచ్ఛతగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.


