ఉపాధి.. పల్లెకు ఊపిరి | - | Sakshi
Sakshi News home page

ఉపాధి.. పల్లెకు ఊపిరి

Oct 14 2026 11:16 AM | Updated on Oct 14 2026 11:16 AM

కూలీలకు పని కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక ప్రతీ గ్రామంలో రోజుకు 50 మందికి పని కార్యదర్శులు, సర్పంచ్‌లకు బాధ్యతలు పనులను గుర్తించే పనిలో అధికారులు

సాక్షి, సిద్దిపేట: గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి పనులు భరోసా ఇస్తున్నాయి. ఎల్‌నినో ఎఫెక్ట్‌తో పంటల సాగు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వ్యవసాయ కూలీలు, ఇతరులు ఇబ్బందులు పడవద్దన్న ఉద్దేశంతో వీబీ జీ రామ్‌జీలో భాగాంగా ప్రత్యేక ప్రణాళికలను రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా రోజుకు సగటున 9వేల మంది కార్మికులు ఒక్కో గ్రామంలో సగటున 19 మంది కార్మికులు పనులకు హాజరవుతున్నారు. కనీసం ఒక్కో గ్రామంలో 50మంది కూలీలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నిర్ణయించారు.

కూలీల సమీకరణలో ..

కూలీల సమీకరణలో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కార్యదర్శులు క్షేత్రస్థాయిలో సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పనులకు డిమాండ్‌ పెంచాలి. ప్రతి గ్రామ పంచాయతీలో అవసరమైన పనులను గుర్తించి, నిరంతరాయంగా ఉపాధి కల్పించేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలి. పనుల నిర్వహణ, కొలతలు పని విభజన సక్రమంగా ఉండేలా పర్యవేక్షణ పటిష్టం చేశారు. వచ్చే వారం నుంచి కార్మికుల హాజరు పురోగతి ఉండేలా ప్రణాళికలను రూపొందించారు.

కూలీలకు అవగాహన..

ఎంపీడీఓ, ఎంపీఓ, టీఏలు బృందాలు ఏర్పాటు చేసి ప్రతీ గ్రామంలో సభలను నిర్వహిస్తున్నారు. గ్రామసభల్లో వీబీజీ రామ్‌జీ ద్వారా కల్పించే పనులపై కూలీలకు అవగాహన కల్పించడంతో పాటు వివిధ శాఖల అధికారులు అందరూ విధిగా హాజరై తమ శాఖకు అవసరమైన పనులను గుర్తించి ప్రణాళికలో చేర్చాలి. ఆయా పనులను జీపీఎస్‌ లోకేషన్‌ ఆధారంగా పరిశీలించాలి. గుర్తించిన పనులను ప్రాధాన్య క్రమంలో సూచిస్తూ వికసిత్‌ గ్రామ పంచాయతీ ప్రణాళికలు ఆమోదం చేపట్టాలి.

కూలీల వివరాలు (లక్షల్లో)

మొత్తం జాబ్‌ కార్డులు: 1.97

కూలీల సంఖ్య: 3.88

యాక్టివ్‌ ఉన్న జాబ్‌ కార్డులు: 1.19

యాక్టిక్‌ ఉన్న కూలీల సంఖ్య: 1.97

ఎల్‌నినో ఎఫెక్ట్‌ వేళ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement