కరెంట్‌ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

కరెంట్‌ కష్టాలు

Oct 14 2026 11:16 AM | Updated on Oct 14 2026 11:16 AM

● ఎండుతున్న పంటలు.. ● ట్యాంకర్‌తో నీళ్లు పారిస్తున్న రైతులు

● ఎండుతున్న పంటలు.. ● ట్యాంకర్‌తో నీళ్లు పారిస్తున్న రైతులు

దుబ్బాకటౌన్‌: ఫొటోలో కనిపిస్తున్న కౌలు రైతు పేరు బాలమల్లు. దుబ్బాక మున్సిపల్‌ పరిధి లోని ధర్మాజీపేట వార్డుకు చెందిన ఆయన.. గ్రామంలో 4 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి వేశారు. వరి పొలం ఎండిపోతోందని ఆవేదనతో, చేసేదేమీ లేక డబ్బులు పెట్టి వాటర్‌ ట్యాంకర్‌ తెప్పించి పొలానికి నీళ్లు పెడుతున్నారు. ఇలా చాలా మంది రైతులు జిల్లా వ్యాప్తంగా వ్యవసాయానికి సకాలంలో కరెంట్‌ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట చేతికి వచ్చే దశలో కరెంట్‌ సరిగా రాక, నీరు పారక పొలాలు ఎండుతున్నాయి.

బోరుబావులు, మోటార్లు ఉన్నా.. కరెంట్‌ లేకపోవడంతో నీళ్లు పారడం లేదని రైతులు వాపోతున్నారు. చేతికొచ్చే దశలో పొలం వాడిపోతోంది. పంటను కాపాడుకోవడానికి రైతులు తప్పనిసరి పరిస్థితిలో ట్యాంకర్‌ ద్వారా నీళ్లు పోస్తున్నారు. ఒక ట్యాంకర్‌ నీటికి రూ.వెయ్యి నుంచి రూ.1200 వరకు ఖర్చు అవుతుందని, ఇలా రోజూ ట్యాంకర్లతో నీళ్లు పోస్తే పెట్టుబడి కూడా రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టాన్ని నమ్ముకుని కౌలుకు తీసుకొని వరి వేస్తే నోటికాడి బువ్వను తన్నుకుపోయినట్లు కరెంట్‌ కోతలు పొట్ట మీద కొడుతున్నాయని వాపోయారు. వ్యవసాయానికి అవసరమయ్యే విద్యుత్‌ ఇచ్చి ఎండుతున్న పంటలను కాపాడాలని పలువురు రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement