హుస్నాబాద్‌ను కరీంనగర్‌లో కలపాల్సిందే | - | Sakshi
Sakshi News home page

హుస్నాబాద్‌ను కరీంనగర్‌లో కలపాల్సిందే

Oct 14 2026 11:16 AM | Updated on Oct 14 2026 11:16 AM

● ‘గౌరవెల్లి’కి నిధులు మంజూరు చేయాలి ● మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌ రెడ్డి

● ‘గౌరవెల్లి’కి నిధులు మంజూరు చేయాలి ● మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌ రెడ్డి

హుస్నాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు హుస్నాబాద్‌ను కరీంనగర్‌ జిల్లాలో కలపాలని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం పట్టణంలోని అనబేరి సింగిరెడ్డి అమరుల భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్‌ నియోజకవర్గాన్ని విలీనం చేయవద్దని ఆనాడే వ్యతిరేకించామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా నేటికి విలీన ప్రక్రియను ప్రారంభించలేదన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేయకుండా వివక్ష చూపారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కావల్సిన నిధులను విడుదల చేయాలన్నారు. సాగు నీరు లేక, కరెంట్‌ సరిగా రాక వేసిన పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే కరువు మండలాలను ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ ఎన్నికల్లో విజయం సాధించిన టీఎంయూ, ఈయూ కూటమి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, పలు డిమాండ్ల సాధనకై పోరాటాలు చేయాలన్నారు. సర్‌ పేరుతో ఓట్లను తొలగించి ఓట్‌ చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు. సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి గడిపె మల్లేశ్‌, నియోజకవర్గ కన్వీనర్‌ జాగీర్‌ సత్యనారాయణ, నాయకులు కొయ్యడ కొమురయ్య, లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement