పత్తి కొనుగోళ్లు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

పత్తి కొనుగోళ్లు చేపట్టాలి

Oct 14 2026 11:16 AM | Updated on Oct 14 2026 11:16 AM

● అదనపు కలెక్టర్‌ లక్ష్మీకిరణ్‌ ● అధికారులకు దిశానిర్దేశం

● అదనపు కలెక్టర్‌ లక్ష్మీకిరణ్‌ ● అధికారులకు దిశానిర్దేశం

సిద్దిపేటరూరల్‌: దసరా పండుగ తర్వాత జిల్లాలో పత్తి పంట కొనుగోళ్లు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ లక్ష్మీ కిరణ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాల్‌లో పత్తి కొనుగోలు సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అదనపు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 9 వ్యవసాయ మార్కెట్‌ కమిటీల పరిధిలో 23 సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో తూకం యంత్రాలు, తేమ శాతం తెలిపే యంత్రాలు సిద్ధం చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్‌ అధికారి దుర్గం ప్రకాష్‌, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా తూనికలు, కొలతల అధికారి శివరంజని, సీసీఐ అధికారులు, పత్తి మిల్లర్లు, మార్కెటింగ్‌ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement