శ్రీకర్‌ సీడ్స్‌తో నష్టపోయాం | - | Sakshi
Sakshi News home page

శ్రీకర్‌ సీడ్స్‌తో నష్టపోయాం

Oct 13 2026 11:37 AM | Updated on Oct 13 2026 11:37 AM

శ్రీకర్‌ సీడ్స్‌తో నష్టపోయాం ఓటు చోరీపై ఆధారాలుంటే బయటపెట్టాలి భూ నిర్వాసితులసమస్యలు పరిష్కరించాలి సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన రైతులు

హుస్నాబాద్‌: శ్రీకర్‌ సీడ్స్‌ కంపెనీ ప్రతినిధులు చెప్పిన మాటలు విని వరి సాగు చేసి తీవ్రంగా నష్టపోయామని సోమవారం ప్రజావాణిలో రైతులు ఫిర్యాదు చేశారు. కంపెనీ ప్రతినిధులు తమ బావుల వద్దకు వచ్చి శ్రీకర్‌ సీడ్స్‌ వరి విత్తనాలు సాగు చేస్తే ఎకరానికి రూ.70వేలు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. గత యాసంగి సీజన్‌లో 50 ఎకరాల్లో 15 మంది రైతులు వరి సాగు చేయగా, ఎకరానికి రెండు నుంచి మూడు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పండిన ధాన్యాన్ని తీసుకువెళ్లినప్పటికి తమకు చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వలేదన్నారు. సంబంధిత కంపెనీ ప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు విజ్ఞప్తి చేశారు.

గజ్వేల్‌: ఓటు చోరీ జరిగిందంటూ ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు ఆధారాలుంటే బయటపెట్టాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాదరావు సవాల్‌ చేశారు. సోమవారం గజ్వేల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏ పోలింగ్‌ బూత్‌లో ఎంతమంది ఓట్లు తొలగించారు? ఎవరికి సంబంధించిన ఓట్లను తొలగించారో స్పష్టంగా వెల్లడించాలని ఆయన డిమాండ్‌ చేశారు. హుస్నాబాద్‌లో అర్హులైన ఓట్లను తొలగించారన్న అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ బహిరంగ చర్చకు సిద్దమా? అంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత కీలకమైన హక్కు అని అన్నారు. అర్హులకు ఓటు దూరమైతే సమగ్ర విచారణ జరగాల్సిందేనని అభిప్రాయపడ్డారు. విలేకరుల సమావేశంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ గాడిపల్లి భాస్కర్‌, పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు మనోహర్‌యాదవ్‌, నాయకులు లక్ష్మణ్‌గౌడ్‌, వెంకట్‌రెడ్డి, రాజేశ్వర్‌చారి తదితరులు పాల్గొన్నారు.

గజ్వేల్‌రూరల్‌: భూనిర్వాసితులకు పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఐ గజ్వేల్‌ నియోజకవర్గ కార్యదర్శి శివలింగ కృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల ప్రజలతో కలిసి సోమవారం పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద నిరసన తెలిపిన అనంతరం ఐవోసీలోని ప్రజావాణిలో ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ సర్వం త్యాగం చేసిన ముంపు గ్రామాల ప్రజలకు ప్రభుత్వం ఇస్తామన్న పరిహారం ఇంకా పెండింగ్‌లోనే ఉందన్నారు. ప్రాజెక్టులను నిర్మించి ఏళ్లు గడుస్తున్నా పరిహారం చెల్లించడంలో పాలకులు, అధికారుల నిర్లక్ష్యం తగదన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు వెంకటచారి, వెంకటేశం, భూనిర్వాసితులు పాల్గొన్నారు.

సీపీ రష్మీ పెరుమాళ్‌

సిద్దిపేటకమాన్‌: సైబర్‌ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ రష్మీ పెరుమాళ్‌ తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో వైద్య విద్యార్థులకు సైబర్‌ నేరాలపై అవగహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీ రష్మీ పెరుమాళ్‌ మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ ఆర్డర్‌ వస్తువుల డెలివరీ సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులు ఓపెన్‌ చేయకూడదని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులకు ఏటీఎం పిన్‌, క్రెడిట్‌ కార్డు వివరాలు, ఫోన్‌లకు వచ్చే ఓటీపీ వివరాలు తెలపకూడదన్నారు. సైబర్‌ నేరాల భారిన పడితే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement