గిరిప్రదక్షిణం.. ఆధ్యాత్మిక తరంగం | - | Sakshi
Sakshi News home page

గిరిప్రదక్షిణం.. ఆధ్యాత్మిక తరంగం

Oct 13 2026 11:37 AM | Updated on Oct 13 2026 11:37 AM

నాచగిరి ప్రదక్షిణలో భక్తజన సందోహం

వర్గల్‌(గజ్వేల్‌): నాచగిరి లక్ష్మీనృసింహుని సన్నిధానం స్వాతి నక్షత్ర మహోత్సవంతో అలరారింది. గిరి ప్రదక్షిణ సంరంభంతో హరిద్రాతీరం పరవశించింది. శ్రీవారి జన్మనక్షత్రం సందర్భంగా సోమవారం పీఠాధిపతి మాధవానంద సరస్వతిస్వామి స్వీయ పర్యవేక్షణలో ఉదయం ఉత్తరద్వారం వద్ద గిరిప్రదక్షిణ ప్రారంభమైంది. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, వేలాది భక్తులు ‘శ్రీనారసింహ జై’ అంటూ పీఠాధిపతిని అనుసరిస్తూ గిరిప్రదక్షిణ చేశారు. నాచగిరి కొండలు చుడుతూ, హరిద్రా తీరం మీదుగా గిరి ప్రదక్షిణ ఆద్యంతం ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. మరోవైపు క్షేత్రంలో సుదర్శన మహాయాగం నిర్వహించి పూర్ణాహుతి చేశారు. రాత్రి సింహవాహనసేవ నిర్వహించారు. భక్తజనులు వేడుకలో పాల్గొని గర్భగుడిలో స్వామివారిని దర్శించుకుని తరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement