సిద్దిపేటజోన్: జిల్లా దశాబ్ది సందర్భంగా నిర్వహించిన పదేళ్ల పండుగ పది తరాలకు గుర్తు ఉండేలా జరిగిందని, ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. ముగింపు సభకు తరలివచ్చిన ప్రజానీకానికి, కృషి చేసిన పార్టీ నాయకులు, శ్రేణులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పదేళ్ల పండుగలో అన్ని వర్గాలు స్వచ్ఛందంగా ఎవరికి వారు అనేక కార్యక్రమాలు నిర్వహించారన్నారు. కవులు, కళాకారులు, జర్నలిస్టులు, వైద్యులు, న్యాయవాదులు, ప్రజా సంఘాలు, వ్యాపార వర్గాలు, విద్యావేత్తలు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, ప్రొఫెసర్లు తదితర సంఘాల ప్రతినిధులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.


