● రేపటి బంగారు సిద్దిపేటే లక్ష్యం కావాలి
● మాజీ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేటజోన్: ‘సిద్దిపేట జిల్లా అనే ఆకాంక్ష ఇప్పటిది కాదు. కొన్ని దశాబ్దాల కల ఒకప్పుడు ఎన్నికలు వస్తే జిల్లా నినాదం గోడల మీద రాతలుగా ఉండేది. దాన్ని నిజం చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కు దక్కింది’ అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల వద్ద 10కే రన్ నిర్వహించారు. హరీశ్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ 10కే రన్ స్ఫూర్తితో అంతే వేగంగా జిల్లా మరింత అభివృద్ధి చేసుకుందమన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తు లో బంగారు సిద్దిపేట సాధన దిశగా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట సమగ్రాభివద్ధి జరిగిందన్నారు. రేపటి సిద్దిపేట జిల్లాలో యూనివర్సిటీ రావాలని, ఇదొక్కటే మిగిలిపోయిందన్నారు. ఆ దిశగా అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన10కే రన్ లో హరీశ్‌రావు సైతం పాల్గొన్నారు. కార్యక్రమంలో వేలాదిమంది యువకులు, మహిళలు పాల్గొన్నారు.


