పూల జాతరకు వేళాయె.. | - | Sakshi
Sakshi News home page

పూల జాతరకు వేళాయె..

Oct 10 2026 8:02 AM | Updated on Oct 10 2026 8:02 AM

నేడే చిన్న బతుకమ్మ

● పూల కొనుగోళ్లతో మార్కెట్లలో సందడి

● పాఠశాలల్లో ముందస్తు సంబురాలు

బతుకమ్మ, మహాలయ అమావాస్య, దేవి శరన్నవరాత్రి ఉత్సవాల వేళ జిల్లా అంతటా కోలాహలంగా మారింది. చిన్న బతుకమ్మను శనివారం నిర్వహించుకునేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. పితృదేవతలకు పూజలు నిర్వహించి, బతుకమ్మను పేర్చేందుకు జిల్లా ప్రజలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన మార్కెట్లన్నీ గునుగు, తంగెడు, పట్టు, చామంతి, బంతి, గడ్డి, తదితర పూల విక్రయాలతో కళకళలాడాయి. ఇదిలా ఉంటే.. జిల్లా కేంద్రంలో పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. మరోవైపు దేవి శరన్నవరాత్రోత్సవాలు నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు గాను వాడవాడల అమ్మవారి మండపాలను అందంగా అలంకరిస్తున్నారు. ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వంసిద్ధం చేస్తున్నారు.

– ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement