టీడబ్ల్యూయూ విజయకేతనం! | - | Sakshi
Sakshi News home page

టీడబ్ల్యూయూ విజయకేతనం!

Oct 10 2026 8:02 AM | Updated on Oct 10 2026 8:02 AM

సిద్దిపేటకమాన్‌/దుబ్బాక/హుస్నాబాద్‌/గజ్వేల్‌రూరల్‌: జిల్లాలోని ఆర్టీసీ డిపోల్లో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌, హుస్నాబాద్‌ ఆర్టీసీ డిపోల్లో శుక్రవారం ఉదయం 5 నుంచి సాయంత్రం 6గంటల వరకు ఓటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. కాగా.. దుబ్బాక, గజ్వేల్‌– ప్రజ్ఞాపూర్‌, హుస్నాబాద్‌ డిపోల్లో కాంగ్రెస్‌ మద్దతుతో పోటీచేసిన తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ విజయం సాధించింది. ఎన్నికలు నిర్వహించిన ఆర్టీసీ డిపోల్లో లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు ఎన్నికల నిర్వహణ అధికారులుగా వ్యవహరించారు. డిపో మేనేజర్లు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

● దుబ్బాక డిపోలో మొత్తం 126 ఓట్లు ఉండగ వందశాతం పోల్‌ అయ్యాయి. టీడబ్ల్యూయూకు 66 ఓట్లు, ఈయూకు 60 ఓట్లు రాగా 6 ఓట్ల మెజార్టీతో టీడబ్ల్యూయూ గెలుపొందింది. తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ దుబ్బాక డిపో ప్రెసిడెంట్‌గా దొడ్ల శ్రీనివాస్‌,సెక్రటరిగా మహేందర్‌రెడ్డి విజయం సాధించారు.

● హుస్నాబాద్‌ డిపోలో మొత్తం 207 ఓట్లకు 205 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీడబ్ల్యూయూ కూటమికి 113 ఓట్లు, టీఎంయూ కూటమికి 92 ఓట్లు వచ్చాయి. 21 ఓట్ల తేడాతో టీడబ్ల్యూయూ కూటమి విజయం సాధించింది. గెలుపుతో కూటమి నాయకులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకొన్నారు.

● సిద్దిపేట ఆర్టీసీ డిపోలో జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో ఎంప్లాయీస్‌ యూనియన్‌, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌, తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ జేఏసీ కూటమి 203ఓట్లతో విజ యం సాధించింది. ఈయూ, ఎన్‌ఎంయూ, టీఎంయూ కూటమి నాయకులు, మద్దతుదారులు సంబరాలు నిర్వహించారు.

● జీపీపీ(గజ్వేల్‌–ప్రజ్ఞాఫూర్‌) ఆర్టీసీ డిపోలో మొత్తం 224 ఓట్లు ఉండగా, 223 ఓట్లు పోలయ్యాయి. టీడబ్ల్యూయూ స్టేట్‌కు 118 ఓట్లు, లోకల్‌కు 125, ఎంప్లాయీస్‌ యూనియన్‌ స్టేట్‌కు 88, లోకల్‌కు 72, బీఎంఎస్‌ స్టేట్‌కు 14, లోకల్‌కు 24 ఓట్లు వచ్చాయి. ఈ సందర్భంగా తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ డిపో అధ్యక్ష, కార్యదర్శులు రామచంద్రారెడ్డి, నర్సింహులు మాట్లాడుతూ టీడబ్ల్యూయూ గెలుపు కార్మికుల విజయమని అన్నారు.

ప్రశాంతంగా ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు

దుబ్బాక, గజ్వేల్‌– ప్రజ్ఞాపూర్‌, హుస్నాబాద్‌ డిపోల్లో నేతల సంబరాలు

ఈనెల 17న అధికారికంగా ఫలితాల ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement