నినాదాల నుంచి.. నిజాల దాకా | - | Sakshi
Sakshi News home page

నినాదాల నుంచి.. నిజాల దాకా

Oct 9 2026 6:48 AM | Updated on Oct 9 2026 6:48 AM

శుక్రవారం శ్రీ 9 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 ● పదేళ్లలో విద్య, వైద్యం, మౌలిక వసతుల్లో గణనీయ మార్పులు ● నేటి నుంచి మూడు రోజుల పాటు దశాబ్ది వేడుకలు ● ‘సాక్షి’తో ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు

న్యూస్‌రీల్‌

ఈ నెల 10న (శనివారం) సాయంత్రం 4 గంటల లోపు పై నంబర్లుకు వాట్సాప్‌ చేయండి
శుక్రవారం శ్రీ 9 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026
జిల్లా ఏర్పాటుతో దశాబ్దాల కల సాకారం
● పదేళ్లలో విద్య, వైద్యం, మౌలిక వసతుల్లో గణనీయ మార్పులు ● నేటి నుంచి మూడు రోజుల పాటు దశాబ్ది వేడుకలు ● ‘సాక్షి’తో ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు

సాక్షి, సిద్దిపేట: ‘ఒకప్పుడు సిద్దిపేటలో ఎన్నికల నినాదాలుగా వినిపించిన మాటలు.. నేడు ప్రజల కళ్లెదుట సాకారమైన వాస్తవాలు. ‘సిద్దిపేట జిల్లా కావాలి.. గోదావరి జలాలు రావాలి.. రైలు పరుగులు పెట్టాలి’ అంటూ ఏళ్ల తరబడి సాగిన ఆకాంక్షలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ ఒక్కొక్కటిగా నిజం చేశారు’ అని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. 2016 అక్టోబర్‌ 11న సిద్దిపేట జిల్లాగా అవతరించింది. జిల్లా ఏర్పాటై పదేళ్లవుతున్న సందర్భంగా హరీశ్‌ రావును గురువారం ‘సాక్షి’ పలకరించగా వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే..

నాటి కల.. నేటి జిల్లా

1983లోనే సిద్దిపేటను జిల్లాగా ఏర్పాటు చేయాలని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు కేసీఆర్‌ వినతిపత్రం ఇచ్చారు. అదే చేతులతో జిల్లాను కేసీఆర్‌ ఏర్పాటు చేశారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకుని 2016లో సాకారం చేశారు. జిల్లా ఏర్పాటు కేవలం భౌగోళిక మార్పు కాదు.. సిద్దిపేట అభివృద్ధికి కొత్త అధ్యాయం. జిల్లా ఏర్పాటుతో అనేక ఇబ్బందులకు తెరపడింది. గతంలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ సిద్దిపేట జిల్లా ఏర్పాటు ప్రధాన నినాదంగా ఉండేది. సిద్దిపేటకు గోదావరి జలాలు, రైలు తీసుకురావాలన్నది ప్రజల చిరకాల కోరిక. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడంతో ఇక్కడి ప్రజల ఈ మూడు ప్రధాన ఆకాంక్షలు సాకారమయ్యాయి. జిల్లా ఏర్పడింది.. గోదావరి జలాలు సిద్దిపేటను ముద్దాడాయి.. రైలు సైతం సిద్దిపేట గడ్డపై పరుగులు పెట్టింది.

విద్యకు.. వైద్యానికి కొత్త బలం

జిల్లా ఏర్పాటుతో విద్య, వైద్య రంగాల్లో సిద్దిపేటలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. వైద్య కళాశాలతో వైద్య విద్య అందుబాటులోకి వచ్చింది. పేదలకు మెరుగైన వైద్యం అందించే వసతులు పెరిగాయి.

అభివృద్ధి పనులకు ప్రస్తుత సర్కారు బ్రేకులు

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జిల్లాలో రహదారుల నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ ద్వారా రూ.552 కోట్లు మంజూరు కాగా.. గతంలోనే రూ.200 కోట్ల పనులు పూర్తయ్యాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన రూ.352 కోట్ల పనులు నిలిచిపోయాయి.

మూడు రోజులు.. దశాబ్ది సంబరం

జిల్లా ఆవిర్భావానికి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 9, 10, 11 తేదీల్లో దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాం. 9న 10కే రన్‌, విద్యార్థి–యువజన సదస్సు, ఉపాధ్యాయులు–ఉద్యోగులు–రిటైర్డ్‌ ఉద్యోగుల సదస్సులు జరగనున్నాయి. 10న కవిసమ్మేళనం, కోమటిచెరువు–రూబీ నెక్లెస్‌ రోడ్డులో ఫుడ్‌ ఫెస్టివల్‌, లేజర్‌ షో జరగనుంది.

మాట్లాడుతున్న హరీశ్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement