సిద్దిపేటరూరల్: జిల్లాలో భూముల రీ సర్వేను వేగిరం చేయాలని, నవంబర్ 30 లోపు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ, సర్వే ల్యాండ్ అధి కారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఎంపికై న ప్రతి మండలంలోని రెండు గ్రామాల్లో రెవెన్యూ, ల్యాండ్ సర్వే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. రికార్డులను పరిశీలించి భూ మి సర్వే చేసి నివేదికలను అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధి కారి నాగరాజమ్మ, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ ఆర్డీవోలు సదానందం, చంద్రకళ, రామ్మూర్తి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య, ఏడి ల్యాండ్ సర్వే సుదర్శన్, తహసీల్దారులు, డిప్యూటీ తహశీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.


