‘సర్‌’తో ఓట్లు తొలగిస్తారా? | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’తో ఓట్లు తొలగిస్తారా?

Oct 8 2026 7:05 AM | Updated on Oct 8 2026 7:05 AM

● బీజేపీ అనుబంధ సంస్థగా ఎన్నికల సంఘం ● మంత్రి పొన్నం ప్రభాకర్‌

● బీజేపీ అనుబంధ సంస్థగా ఎన్నికల సంఘం ● మంత్రి పొన్నం ప్రభాకర్‌

హుస్నాబాద్‌: ఎన్నికల సంఘం బీజేపీ అనుబంధ సంస్థగా వ్యవహరిస్తూ లక్షల ఓట్లను తొలగిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి ఎంపీల అరెస్ట్‌కు నిరసనగా బుధవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. హుస్నాబాద్‌ పట్టణంలోని గాంధీ విగ్రహం ఎదుట ఽమంత్రి బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ ఎంపీలను, ప్రతిపక్ష నాయకులను అరెస్ట్‌ చేసి వారి గొంతును అణచివేయడం నియంతృత్వ వైఖరికి నిదర్శనమన్నారు. ఓటరు సవరణ ప్రక్రియ పేరుతో ఎన్నికలను అపహాస్యం చేస్తున్న సీఈసీ జ్ఞానేశ్వర్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతుందన్నారు. ఓట్లనే ఎన్నికల కమిషన్‌ దొంగిలిస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. ఓటు హక్కును తొలగించే హక్కు జ్ఞానేశ్వర్‌ కుమార్‌కు లేదన్నారు. మరోసారి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతున్న పరిస్ధితుల్లో వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పై ఉందన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఓట్లను లక్ష్యంగా చేసుకొని ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకులు ఓటు బచావో, దేశ్‌ బచావో అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారని తెలిపారు. ఓటు హక్కు ప్రతి భారతీయుడి ప్రజాస్వామ్య గుర్తింపు అని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ దండి లక్ష్మి, వైస్‌ చైర్‌ పర్సన్‌ చిత్తారి పద్మ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ తిరుపతి రెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ బొలిశెట్టి శివయ్య, మాజీ గ్రంథాలయ చైర్మన్‌ కేడం లింగమూర్తి, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్‌, కాంగ్రెస్‌ పట్టణ అద్యక్షుడు వెంకట రమణ, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement