పారదర్శకంగా భూముల రీ సర్వే | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా భూముల రీ సర్వే

Oct 6 2026 8:37 AM | Updated on Oct 6 2026 8:37 AM

● ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి ● కలెక్టర్‌ హైమావతి

● ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి ● కలెక్టర్‌ హైమావతి

అక్కన్నపేట(హుస్నాబాద్‌): భూ రీ–సర్వే ప్రక్రియను పారదర్శకంగా, కచ్చితత్వంతో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని కలెక్టర్‌ హైమావతి అధికారులను ఆదేశించారు. అక్కన్నపే ట మండలం కేశవాపూర్‌లో సోమవారం భూ భారతి రీ–సర్వే ప్రక్రియను కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకే భూ భారతి రీ సర్వే చేపట్టిందని తెలిపారు. ముందుగా రెవెన్యూ సర్వే గ్రామ సరిహద్దులు సర్వే చేశాక, ప్రభుత్వ స్థలాలకు గుర్తించి వాటి చుట్టూ హద్దులు పాతాలని అధికారులను ఆదేశించారు. రీ–సర్వే సమయంలో భూమి విస్తీర్ణం, సర్వే నంబర్లు, హద్దులు, పట్టా వివరాలు తదితర అంశా లను సంబంధిత రికార్డులతో సరిపోల్చి నమోదు చేయాలన్నారు. రీ సర్వే వేగంగా అత్యంత పారదర్శకంగా నిర్వహించడానికి రోవర్స్‌ అధునాతన యంత్రాలు కొనుగోలు చేస్తున్ననట్లు తెలిపారు. రీ–సర్వే ప్రక్రియ గూర్చి రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో హుస్నాబాద్‌ ఆర్డీఓ రామ్మూర్తి, తహసీల్దార్‌ సింహచలం మధుసూదన్‌, సర్పంచ్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement