పట్టణ, మండల కేంద్రాల్లోని పలు దుకాణాల్లో, వాహనాల్లో గ్యాస్ రీ ఫిల్లింగ్ చేసే వారు అంతా బహిరంగంగానే ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. మధ్య తరగతి ప్రజలు, చిరు వ్యాపారులు, ఉన్నత చదువుల కోసం వివిధ గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి, పట్టణ ప్రాంతాలకు వస్తున్న యువకులు, విద్యార్థులు, ఒంటరి మహిళలు, వృద్ధులు మినీ సిలిండర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీరి అవసరాలను ఆసరా చేసుకొని అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికై నా సంబందిత శాఖ అధికారులు, పోలీసులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.


