గ్రామాభివృద్ధికి నిధులివ్వండి | - | Sakshi
Sakshi News home page

గ్రామాభివృద్ధికి నిధులివ్వండి

Oct 4 2026 7:20 AM | Updated on Oct 4 2026 7:20 AM

సమస్యల పరిష్కారం కోసం మంత్రికి వినతి

సమస్యల పరిష్కారం కోసం మంత్రికి వినతి

కొండపాక(గజ్వేల్‌): గ్రామ పంచాయతీ పరిధిలో నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవచూపి పరిష్కారమయ్యేలా చూడాలని కోరుతూ కొండపాక మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్‌ కమిటీ సభ్యులు శనివారం పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రి గడ్డం వివేక్‌ను సచివాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను పట్టించుకోకపోవడంతో వివిధ సమస్యలు పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నాన్నారు. స్పందించిన మంత్రి వెంటనే ఆయా శాఖల సంబంధిత అధికారులకు సమాచారం అందిస్తూ సమస్యల పరిష్కారం విషయంలో అవసరపడే నిధుల కోసం ప్రతిపాదనలు తయారు చేసి పంపించాలని ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నియోజక వర్గంలో పార్టీ బలోపేతం అయ్యేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మంచాల కనకరాములు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ బట్ట పర్శరాములు, జిల్లా జనరల్‌ సెక్రటరీ భైరీ ప్రణిత్‌రెడ్డి, సర్పంచ్‌ వెంకటేశంగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement