కొనుగోలు కేంద్రానికి ఆ భూమివ్వండి | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు కేంద్రానికి ఆ భూమివ్వండి

Oct 4 2026 7:20 AM | Updated on Oct 4 2026 7:20 AM

కొండపాక(గజ్వేల్‌): కొండపాక గ్రామ శివారులోని సర్వేనంబర్లు 731, 733లలో గల 2.18 ఎకరాల ప్రభుత్వ భూమిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసుకునేందుకు అనుమతివ్వాలని కోరుతూ గ్రామస్తులు శనివారం తహసీల్దార్‌ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఏళ్ల కాలంగా భూమి ఖాళీగా ఉంటుండటంతో ముళ్ల పొదలు, పిచ్చిమొక్కలు మొలకెత్తడంతో కోతులకు, అడవి పందులకు ఆవాసంగా మారిందని పేర్కొన్నారు. దీంతోపాటుగా ప్రభుత్వ భూమి ప్రక్క నుంచి వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు కోతుల, అడవి పందులుంటున్నాయన్న భయంతో వెళ్లడానికి జంకుతున్న విషయమై గ్రామస్తులు గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకువచ్చారన్నారు. దీంతో ప్రభుత్వ భూమిలో మొలకెత్తిన పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలను తొలగించి ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణ కోసం ఉపయోగించుకోవాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసుకున్న విషయాన్ని సైతం పేర్కొన్నారు. చెరువుకు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని గ్రామ పంచాయతీకి అప్పగిస్తే బతుకమ్మ పండుగ నిర్వహణతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణ కోసం ఉపయోగించుకోవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement