బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్‌రెడ్డి
మిరుదొడ్డి(దుబ్బాక): సమాజంలో గౌరవ ప్రదమైన వృత్తి ఏదైనా ఉందంటే కేవలం అది ఉపాధ్యాయులదేనని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్‌రెడ్డి తెలిపారు. నైపుణ్య ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శనివారం మిరుదొడ్డి మండల ఉత్తమ ఉపాధ్యాయుల అభినందన సభ కార్యక్రమం నిర్వహించా రు. ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషిస్తారన్నారు. సమాజంలో మంచి మార్పు రావాలంటే తరగతి గదిలోనే విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు అంకిత భావంతో పని చేస్తేనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రవీణ్‌బాబు, నైపుణ్య ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మొగుళ్ళ ఐలయ్య, స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ వెంకట రాజలింగం, మాజీ ఎంపీటీసీ గొట్టం భైరయ్య, బీఆర్ఎస్ నాయకులు రామచంద్రం, బాల్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.


