జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాల్సిందే | - | Sakshi
Sakshi News home page

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాల్సిందే

Oct 4 2026 7:20 AM | Updated on Oct 4 2026 7:20 AM

యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి హేమంత్‌

యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి హేమంత్‌

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి పుట్ల హేమంత్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలో శనివారం యూఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కళ్లుమూసుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా హేమంత్‌ మాట్లాడుతూ...స్వతంత్రంగా విధులు నిర్వహించాల్సిన ఎన్నికల కమిషనర్‌ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ప్రసాద్‌, రోహిత్‌, వినయ్‌, కుమార్‌, సాయి, శ్రీను, బాలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement