ఘనంగా జిల్లా పదేళ్ల పండుగ | - | Sakshi
Sakshi News home page

ఘనంగా జిల్లా పదేళ్ల పండుగ

Oct 3 2026 7:18 AM | Updated on Oct 3 2026 7:18 AM

ఘనంగా జిల్లా పదేళ్ల పండుగ అభివృద్ధి పనులు చేపట్టాలి

మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపు

సిద్దిపేటజోన్‌: కొన్ని దశాబ్దాల సిద్దిపేట ప్రజల ఆకాంక్ష జిల్లా ఏర్పాటై ఈ నెల 11నాటికి పదేళ్లు పూర్తి కానుందని ఈ వేడుకలను జిల్లా అంతటా ఘనంగా నిర్వహించుకుందామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ...సిద్దిపేట జిల్లా అనే నినాదాన్ని నిజం చేసిన సందర్భం చిరస్మరణీయమన్నారు. సిద్దిపేట ప్రజల ఆకాంక్షను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీద 11అక్టోబర్‌ 2016లో జిల్లా ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు. అందుకు సంబంధించిన ఈ నెల4న జిల్లా కేంద్రంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి వారం రోజుల పండుగ వాతావరణం గూర్చి ప్రణాళికలు తయారు చేద్దామన్నారు. అక్టోబర్‌11న భారీ సభ నిర్వహించాలని, పండుగలో అన్ని వర్గాలను భాగస్వామ్యం చేయాలని సూచించారు.

జెడ్పీ సీఈఓ రమేశ్‌

హుస్నాబాద్‌రూరల్‌: గ్రామాల అభివృద్ధి వికసించే పనులు చేపట్టాలని, కూలీలకు 125 పనులు కల్పన, గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనులు చేయాలని జెడ్పీ సీసీఓ రమేశ్‌ పేర్కొన్నారు. పందిళ్ల గ్రామ సభకు శుక్రవారం హాజరై మాట్లాడూత...వీబీజీ రాంజీ పథకంలో జాబ్‌కార్డు కలిగిన కూలీలకు 125 పని దినాలను కల్పించాలన్నారు. 375 రకాల పనులను గ్రామంలో మౌలిక వసతులు, లింక్‌ రోడ్ల నిర్మాణం చేసి అభివృద్ధిలో పల్లెలను ఆదర్శంగా నిలుపాలని చెప్పారు. కరువులను నివారించడానికి భూగర్భ జలాల అభివృద్ధి పనులు చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement