దుబ్బాక: ఎన్నికల సమయంలో కల్యాణలక్ష్మీ పథకం కింద కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తులం బంగారం హామీ అమలు ఎంతవరకు వచ్చిందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మీ పథకం పుష్కరకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు దుబ్బాకలో కేసీఆర్ ఫ్లెక్సీకి శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2014 అక్టోబర్ 2 న ప్రారంభమైన కల్యాణలక్ష్మీ పథకం తెలంగాణలోని 12.71 లక్షల ఆడబిడ్డల కుటుంబాలకు రూ.11,130 కోట్ల ఆర్థిక సాయం అందించామన్నారు. ఆడబిడ్డ పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకుడదనే గొప్ప ఆలోచనతో కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లు శ్రీరాం సంగీత, సులోచన బీఆర్ఎస్ నాయకులు,కౌన్సిలర్లు పాల్గొన్నారు.
మారెమ్మ ఆలయంలో పూజలు
మండలంలోని తిమ్మాపూర్ మారెమ్మ ఆలయం ప్రథమ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మర్రికుంటలో నూతనంగా నిర్మించనున్న బస్‌షెల్టర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి


