సోలార్‌ పవర్‌తో లబ్ధి | - | Sakshi
Sakshi News home page

సోలార్‌ పవర్‌తో లబ్ధి

Oct 3 2026 7:18 AM | Updated on Oct 3 2026 7:18 AM

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): సూర్యరశ్మి ఆధారిత విద్యుత్‌శక్తితో వినియోగదారులకు లబ్ధి చేకూరుతుందని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ చంద్రశేఖర్‌ వినియోగదారులకు సూచించారు. సేవా సేతు అభియాన్‌ ప్రధాన మంత్రి సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన పథకంపై శుక్రవారం జిల్లా కేంద్రంలో వినియోగదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ..దేశంలోని కోటి కుటుంబాలకు విద్యుత్‌ బిల్లులు తగ్గించి వినియోగదారులకు లబ్ధి చేకూర్చడమే ఈ పథకం లక్ష్యమన్నారు. రూఫ్‌టాప్‌పై సోలార్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకుని ప్రతీ నెల 360 యూనిట్ల వరకు విద్యుత్‌ను పొందవచ్చని చెప్పారు. సోలార్‌ విద్యుత్‌తో బొగ్గు ఆధారిత విద్యుత్‌ వినియోగం తగ్గించడం ద్వారా సహజ వనరులను భావితరాలకు పొదుపు చేయడానికి అవకాశం ఉందన్నారు.

సేవా సేతు అభియాన్‌ను సద్వినియోగం చేసుకోవాలి

విద్యుత్‌శాఖ ఎస్‌ఈ చంద్రశేఖర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement