సిద్దిపేటకమాన్: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను తక్షణమే దేశవ్యాప్తంగా నిలిపివేయాలని సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ నాయకులు అన్నారు. సర్ ప్రక్రియ నిలిపివేయా లని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, సీపీఐ (ఎం ఎల్) న్యూడెమెక్రసీ పార్టీల ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిద్దిపేట బస్టాండ్ చౌరస్తాలో వారు మాట్లాడుతూ.. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్కుమార్ ను తక్షణమే పదవి నుంచి తొలగించాలన్నారు. సర్ ప్రక్రియలో భాగంగా పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించేందుకు చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో లక్షలాది మంది ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నారన్నారు. ఓటర్ల జాబితా సవరణ విషయంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలని, ఎన్నికల ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.


