ప్రభుత్వం అందించిన బ్రేక్ఫాస్ట్ రుచికరంగా ఉంది. ఉదయాన్నే ఆకలితో వచ్చే విద్యార్థులకు టిఫిన్ అందించడంతో చదువు పై ఏకాగ్రత పెరగడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటాం. అధ్యాపకులు బోధించే పాఠాలు కూడా శ్రద్ధగా వినే అవకాశం ఉంటుంది. మెనూ ప్రకారం రోజుకొక వైరెటీ బలవర్ధకమైన టిఫిన్ ఇవ్వడం సంతోషంగా ఉంది. – వర్షిత, ఎంపీసీ, ఇంటర్ ఫస్టియర్, హుస్నాబాద్
పేద విద్యార్థులకు ప్రయోజనం
దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించడం మంచి పరిణామం. పేద విద్యార్థులకు ఎంతో ప్రయోజనం. మధ్యాహ్న భోజనం ద్వారా పోషకాహారం లభించడంతో పాటు తరగతులకు క్రమం తప్పకుండా హాజరు కావడానికి అవకాశం ఉంది.
– సంగీత, బైపీసీ, ఇంటర్ సెకండియర్, హుస్నాబాద్


