● మున్సిపల్ సమావేశంలోనూ చర్చ
గజ్వేల్: వెలిగే బట్టర్ఫ్లై లైట్లకు మరమ్మతుల పేరిట రూ.10లక్షలను ఎజెండాలో చేర్చడంపై మున్సిపల్ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బుధవారం జరిగిన మున్సిపల్ సాధారణ పాలకవర్గ సమావేశంలోనూ అంశం చర్చకు వచ్చింది. పట్టణంలోని జాలిగామ బైపాస్ రోడ్డు వైపున ఉన్న వెలిగే బటర్ఫ్లై లైట్లకు మరమ్మతుల పేరిట రూ.10లక్షలు ఖర్చు పేరిట నిధులు దుర్వినియోగం చేయాలని చూస్తున్నారని, ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని, ఈ రోడ్డులో లైట్లు వెలుగుతున్న తీరును వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపులో పెట్టినట్లు తెలిసింది. బతుకమ్మ పండుగ సమీపిస్తున్న తరుణంలో మరింత మెరుగైన లైటింగ్ కోసం మరమ్మతులు చేయాలనుకుంటున్నామని, కొన్ని చోట్ల వైరింగ్ దెబ్బతిన్నందువల్ల దానిని రిపేర్ చేయాల్సి ఉందని సమాధానం వచ్చినట్లు తెలిసింది. అంతేకాకుండా అభివృద్ధి, ప్రజా సౌకర్యాలు, ఇతర అంశాలను సైతం చర్చించినట్లు సమాచారం.


